Breaking News

ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. విండీస్‌ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహిళలు

Published on Fri, 06/27/2025 - 15:57

స్వదేశంలో (బార్బడోస్‌) ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతున్న వేల ఓ విండీస్‌ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి.  గయానీస్ వార్తా సంస్థ కైటూర్ న్యూస్ నివేదిక ప్రకారం.. గతేడాది ఆస్ట్రేలియాలో చారిత్రక విజయాన్నందించిన ఓ యువ ఆటగాడు అత్యాచారం, లైంగిక వేధింపులు సహా అనేక తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

ఓ టీనేజర్‌ సహా 11 మంది మహిళలు సదరు క్రికెటర్‌పై వేర్వేరుగా ఆరోపణలు చేశారు. తొలుత గయానాలోని బెర్బిస్‌కు చెందిన ఓ యువతి ఈ విషయాన్ని తెరపైకి తెచ్చింది. అప్పటి నుంచి వరుసగా 10 మంది మహిళలు సదరు క్రికెటర్‌పై ఆరోపణలు చేశారు. క్రికెటర్‌పై లైంగిక ఆరోపణల ఉదంతాన్ని కైటూర్ న్యూస్ 'మాన్స్టర్‌ ఇన్ మెరూన్' అనే శీర్షికతో ప్రచురించి వెలుగులోకి తెచ్చింది. 

ఆతర్వాత గయానాలోకి స్పోర్ట్స్ మాక్స్ టీవీ ఈ అంశంపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. గయానా మీడియా ప్రకారం.. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్‌ను కొందరు విండీస్‌ క్రికెట్‌ బోర్డు పెద్దలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత మహిళలు కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు. 

క్రికెటర్‌ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని విండీస్‌ క్రికెట్‌ బోర్డు పెద్దలు ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని బాధితుల్లో ఒకరి తరఫు న్యాయవాది ఆరోపించారు. ఈ విషయంపై విండీస్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ కిషోర్ షాలోను సంప్రదించగా.. తనుకు కానీ, బోర్డుకు కానీ ఈ విషయం గురించి తెలీదని అన్నాడు. ఈ అంశంపై లోతుగా స్పందించేందుకు నిరాకరించాడు.

ఇదిలా ఉంటే, బార్బడోస్‌ వేదికగా వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్‌ కాగా.. వెస్టిండీస్‌ 190 పరుగులు చేసింది. 10 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్‌ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ట్రవిస్‌ హెడ్‌ (13), వెబ్‌స్టర్‌ (19) క్రీజ్‌లో ఉన్నారు. 
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)