Breaking News

WC 2024: ఈసారి ప్రపంచకప్‌ వెస్టిండీస్‌దే: డారెన్‌ సామీ

Published on Fri, 02/09/2024 - 15:19

టీ20 ప్రపంచకప్‌-2024 టైటిల్‌ గెలిచేది తమ జట్టేనని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌, పరిమిత ఓవర్ల ప్రస్తుత కోచ్‌ డారెన్‌ సామీ అన్నాడు. సొంతగడ్డపై పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన తొలి జట్టుగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

గతేడాది తాము టీ20 ఫార్మాట్లో అద్భుత విజయాలు సాధించామని.. ఆ జోరును అలాగే కొనసాగించి విశ్వవిజేతలుగా నిలుస్తామని పేర్కొన్నాడు. కాగా అత్యధికంగా రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్‌(2012,2016) గెలిచిన ఘనత వెస్టిండీస్‌ సొంతం.

కానీ.. గత ఐసీసీ ఈవెంట్లలో దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైంది . టీ20 ప్రపంచకప్‌-2022, వన్డే వరల్డ్‌కప్‌-2023లో గ్రూప్‌ స్టేజ్‌ కూడా దాటకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన విండీస్‌ బోర్డు డారెన్‌ సామీకి కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది.

ఈ క్రమంలో అనూహ్య రీతిలో పుంజుకున్న వెస్టిండీస్‌ గతేడాది వరుస టీ20 సిరీస్‌లు గెలిచింది. సౌతాఫ్రికా(2-1), టీమిండియా(3-2), ఇంగ్లండ్‌ (3-2)లను చిత్తు చేసింది. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తలపడుతోంది.


డారెన్‌ సామీ (PC: WC)

ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌కు ముందుకు డారెన్‌ సామీ మాట్లాడుతూ.. ‘‘గతేడాది మా జట్టు అద్భుతమైన పురోగతి సాధించింది. 2023లో మేము ఒక్క టీ20 సిరీస్‌ కూడా ఓడిపోలేదు.

ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తున్నాం. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌ గెలిచే తొలి జట్టు మాదే అవుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం’’ అని పేర్కొన్నాడు. 

అదే విధంగా.. తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగ్‌లలో సత్తా చాటుతున్న విషయాన్ని డారెన్‌ సామీ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. కాగా ఈ ఏడాది జూన్‌లో జరుగనున్న ప్రపంచకప్‌-2024 ఈవెంట్‌కు యూఎస్‌ఏతో కలిసి వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు వెస్టిండీస్ టీ20 జట్టు:
రోవ్‌మన్‌ పావెల్ (కెప్టెన్), షాయీ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటి, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్‌, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్.

చదవండి: విభేదాలు ఉంటేనేం.. తను నా రక్తం.. మిస్సవుతున్నా: షమీ భావోద్వేగం

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)