Breaking News

కరుణ్‌ నాయర్‌ను తప్పించడంపై చీఫ్‌ సెలెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Thu, 09/25/2025 - 15:55

వెస్టిండీస్‌తో అక్టోబర్ 2న ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (India vs West Indies) కోసం టీమిండియాను (Team India) ఇవాళ (సెప్టెంబర్‌ 25) ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించిన విధంగానే ఇంగ్లండ్‌ పర్యటనలో దారుణంగా విఫలమైన మిడిలార్డర్‌ బ్యాటర్‌ కరుణ్ నాయర్‌కు (karun Nair) చోటు దక్కలేదు.

ఇంగ్లండ్ సిరీస్‌లో కరుణ్‌ 8 ఇన్నింగ్స్‌ల్లో 25.62 సగటున కేవలం ఒకే ఒక హాఫ్‌ సెంచరీ సాయంతో 205 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో కరుణ్‌కు మంచి ఆరంభాలు లభించినా, వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. 

2016లో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన కరుణ్‌.. కొద్ది రోజుల్లో ఫామ్‌ కోల్పోయి కనుమరుగయ్యాడు. ఇటీవల దేశవాలీ క్రికెట్‌లో అసాధారణ ప్రదర్శనలు చేసి తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్‌.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక మరోసారి జట్టులో చోటు కోల్పోయాడు.

ప్రదర్శననే కొలమానంగా తీసుకొని సెలెక్టర్లు కరుణ్‌ తప్పించడం సమంజసమే అయినప్పటికీ.. కొందరు మాత్రం అతడికి మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ (Ajit Agarkar) కరుణ్‌ అంశంపై స్పందించాడు. ఇంగ్లండ్ టూర్‌లో కరుణ్ నుంచి చాలా ఆశించామని తెలిపాడు. కరుణ్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకున్న దేవ్‌దత్‌ పడిక్కల్ (Devdutt Padikkal) మాకు చాలా ఆప్షన్స్ ఇస్తాడని అన్నాడు. ప్రతి ఆటగాడికి 15-20 అవకాశాలు ఇవ్వాలనుకుంటాం. కానీ, అది ఎప్పుడూ సాధ్యపడదని పేర్కొన్నాడు.

సెలెక్టర్లను ఆకట్టుకున్న పడిక్కల్‌
కరుణ్‌ను ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్న సెలెక్టర్లకు పడిక్కల్‌ ఆశాకిరణంలా కనిపించాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న పడక్కల్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ఆస్ట్రేలియా-ఏపై భారీ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం​ పడిక్కల్‌ ఫిట్‌నెస్, ఫామ్‌ సెలక్టర్లను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే రెండు టెస్ట్‌లు ఆడిన పడిక్కల్‌.. మిడిలార్డర్‌లో కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి.

చదవండి: IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్‌ అగార్కర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)