Breaking News

'కచ్చితంగా విజయం మాదే.. మొన్న ఏదో అలా జరిగిపోయింది'

Published on Tue, 08/01/2023 - 09:57

వెస్టిండీస్- భారత్‌ మధ్య సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. ట్రినిడాడ్‌ వేదికగా మంగళవారం జరగనున్న ఈ కీలక మ్యాచ్‌లో భారత్‌-విండీస్‌ జట్టు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక రెండో వన్డేలో ప్రయోగాలు చేసి ఓటమిపాలైన భారత జట్టు.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం పూర్తి స్ధాయి జట్టుతోనే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విండీస్‌ మాత్రం రెండో వన్డే ఫలితాన్నే పునరావృతం చేసి సిరీస్‌ సొంతం చేసు​కోవాలని భావిస్తోంది.

ఇక సిరీస్‌ డిసైడర్‌ మూడో వన్డే నేపథ్యంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కీలక వాఖ్యలు చేశాడు. మూడో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటమని జడ్డూ థీమా వ్యక్తం చేశాడు. "మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. మేము గత మ్యాచ్‌లో ఓడిపోయాం. అదేమి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఆటలో గెలుపు, ఓటములు సహజం. మేము మా జట్టులో కొన్ని ప్రయోగాలు చేశాం. అందుకే ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదు. ఆసియాకప్‌, ప్రపంచకప్‌కుముందు మేము ఆడుతున్న ఏకైక వన్డే సిరీస్‌ ఇది.

అందుకే జట్టు కాంబనేషన్‌లో కొన్ని మార్పులు చేశాం. ఇది మా జట్టుపై ఎటువంటి ప్రభావం చూపదు. ఇక విండీస్‌ యువ ఆటగాళ్లతో కూడిన జట్టు. వారు నేర్చుకోనే స్ధాయిలో ఉన్నారు. అయినప్పటికీ వారు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. వారు భారత జట్టు నుంచి చాలా విషయాలు నేర్చకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. వారిలో అద్భుతమైన టాలెంట్‌ ఉంది. మేము కచ్చితంగా ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌ను సొంతం చేసుకుంటామని జడేజా ఓ స్పోర్ట్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: టీమిండియాతో టీ20 సిరీస్‌.. విండీస్‌ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)