Breaking News

IND VS PAK: రాయుడు, యూసఫ్‌ విధ్వంసం​.. పాక్‌ చిత్తు! టోర్నీ విజేతగా భారత్‌

Published on Sun, 07/14/2024 - 07:35

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్‌ నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్‌ టైటిల్‌ను ముద్దాడింది.

ఈ ఫైనల్‌ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాక్‌ బ్యాటర్లలో షోయబ్‌ మాలిక్‌(41) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అతడితో పాటు కమ్రాన్‌ ఆక్మల్‌(24), మసూద్‌(21) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అనురీత్‌ సింగ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వినయ్‌ కుమార్‌, నేగి, ఇర్ఫాన్‌ పఠాన్‌ తలా వికెట్‌ సాధించారు.

రాయుడు ఫిప్టీ.. యూసఫ్ విధ్వంసం
అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్‌ 19.1 ఓవర్లలో  5 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ ఓపెనర్‌ అంబటి రాయుడు మెరుపు హాఫ్‌ సెంచరీతో మెరిశాడు.

30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు చేసి 50 పరుగులు చేసి రాయుడు ఔటయ్యాడు. ఆఖరిలో యూసఫ్‌ పఠాన్‌(16 బంతుల్లో 30 పరుగులు, 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పాక్‌ బౌలర్లలో యమీన్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. షోయబ్‌ మాలిక్‌,అఫ్రిది, రియాజ్‌ తలా వికెట్‌ సాధించారు. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అంబ‌టి రాయుడు నిల‌వ‌గా.. ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు యూస‌ఫ్ ప‌ఠాన్‌కు వ‌రించింది.


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)