Breaking News

WC 2023: 4,4,4,2,6! ఒకే ఓవర్లో 26 రన్స్‌.. పతిరణ చెత్త రికార్డు! వీడియో వైరల్‌

Published on Sat, 10/07/2023 - 19:17

ICC Cricket World Cup 2023- South Africa vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు శతకాల మోత మోగించారు. ప్రొటిస్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ 84 బంతుల్లో 100 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వాన్‌ డెర్‌ డసెన్‌ 110 బంతుల్లో 108 రన్స్‌ సాధించాడు.

వీరిద్దరిని మించేలా.. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకుని వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో సరికొత్త రికార్డు లిఖించాడు ఎయిడెన్‌ మార్కరమ్‌. ఫాస్టెస్ట్‌ సెంచరీతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.

సుడిగాలి శతకం.. బలైన పతిరణ
మొత్తంగా ఈ మ్యాచ్‌లో 54 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్‌.. 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మార్కరమ్‌ పరుగుల దాహానికి బలైన బౌలర్లలో లంక యువ పేసర్‌ మతీశ పతిరణ ముందు వరుసలో ఉన్నాడు.

ప్రపంచకప్‌ చరిత్రలో చెత్త రికార్డు
ప్రొటిస్‌ ఇన్నింగ్స్‌ 43వ ఓవర్లో పతిరణకు మార్కరమ్‌ చుక్కలు చూపించాడు. రెండో బంతి నుంచి మొదలుపెట్టి వరుసగా 4,4,4,2,6  బాదాడు. ఇక ఓవర్‌ తొలి బంతికి ఒక రన్‌ రాగా.. పతిరణ ఏకంగా ఐదు వైడ్‌బాల్స్‌ వేశాడు. దీంతో మొత్తంగా 43వ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పతిరణ 10 ఓవర్ల బౌలింగ్‌లో రికార్డుస్థాయిలో 95 పరుగులు సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్‌(డికాక్‌) తీశాడు. ఈ క్రమంలో శ్రీలంక తరఫున వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు. 

శ్రీలంక తరఫున వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు వీరే
అషాంత డి మెల్‌- 1987- కరాచిలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో.. 91
మతీశ పతిరణ- 2023*- ఢిల్లీలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో.. 95
నువాన్‌ ప్రదీప్‌- 2019- ది ఓవల్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో.. 88
తిసార పెరీరా- 2015- సిడ్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో..87.

చదవండి: WC 2023: ఆసీస్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌.. మీ తుదిజట్టును ఎంచుకోండి!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)