దక్షిణాఫ్రికా చేతిలో కివీస్‌ ఘోర ​ఓటమి.. సెమీస్‌ రేసులోకి పాకిస్తాన్‌

Published on Wed, 11/01/2023 - 21:58

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పుణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఓటమి పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ప్రోటీస్‌ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది. ఇక న్యూజిలాండ్‌ ఘోర ఓటమితో పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కివీస్‌ నాలుగో స్ధానానికి చేరుకోగా.. ఆస్ట్రేలియా మూడో స్ధానానికి ఎగబాకింది. కివీస్‌ ఓటమితో  పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలు మరింత రెట్టింపు అయ్యాయి. 

పాకిస్తాన్‌ సెమీస్‌కు చేరాలంటే?
ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్‌ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంకా పాకిస్తాన్‌కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ జట్లతో పాకిస్తాన్‌ తలపడనుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటే.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌పై కచ్చితంగా విజయం సాధించాలి. 

అప్పుడు పాక్‌ జట్టు ఖాతాలో 10 పాయింట్లు చేరుతాయి. అయితే  ఈ 10 పాయింట్లతో పాకిస్థాన్ సెమీస్ చేరడం చాలా కష్టం. ఈ సమయంలో ఇతర జట్ల ఫలితాలపై పాక్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 8 పాయింట్లతో నాలుగో స్ధానంలో కివీస్‌ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. మరోవైపు ఆరో స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్‌ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచులు గెలవకూడదు.

అప్పుడు ఈ కివీస్‌, అఫ్గాన్‌ రెండు జట్లు 8 పాయింట్లతో ఉంటే.. పాక్ 10 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఒక వేళ  కివీస్‌ ఒక్క మ్యాచ్‌, అఫ్గానిస్తాన్‌ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే అప్పుడు మూడు జట్లు 10 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ క్రమంలో రన్‌రేట్‌ పరంగా మూడింటిలో ఒక జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.

కాగా పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్ధానంలో ఆస్ట్రేలియా సెమీస్‌కు ఈజీగా చేరే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే ఆసీస్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన చాలు. ఎందుకంటే మెరుగైన రన్‌రేట్‌ ఉంది కాబట్టి సెమీస్‌కు అసీస్‌ క్వాలిఫై అవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో స్ధానం కోసం తీవ్ర పోటీ నెలకొనడం ఖాయమన్పిస్తోంది.
చదవండి: World Cup 2023: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. 190 పరుగుల తేడాతో భారీ విజయం

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)