Breaking News

చరిత్ర సృష్టించిన రిజ్వాన్‌, సౌద్‌ షకీల్‌.. ప్రపంచకప్‌ హిస్టరీలో..!

Published on Fri, 10/06/2023 - 17:21

ICC Cricket World Cup 2023, 2nd Match- - Pakistan vs Netherlands: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా పాకిస్తాన్‌ బ్యాటర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, సౌద్‌ షకీల్‌ చరిత్ర సృష్టించారు. ప్రపంచకప్‌ ఈవెంట్లో నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన పాక్‌ బ్యాటర్ల జోడీలో నాలుగో స్థానంలో నిలిచారు.

అదే విధంగా.. వన్డే వరల్డ్‌కప్‌ అరంగేట్రంలోనే ఒకే మ్యాచ్‌లో యాభైకి పైగా పరుగులు సాధించిన బ్యాటర్లుగా చరిత్రకెక్కారు. కాగా భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌ నెదర్లాండ్స్‌తో ఆడుతోంది.

అర్ధ శతకాలతో ఆదుకున్నారు
అయితే, పసికూనే కదా అని డచ్‌ జట్టును తక్కువగా అంచనా వేసిన బాబర్‌ ఆజం బృందానికి ఆరంభంలోనే షాక్‌ తగిలింది. హైదరాబాద్‌లో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌, సౌద్‌ షకీల్‌ అద్భుత ఆట తీరుతో పాక్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు.

అర్ధ శతకాలతో చెలరేగి నాలుగో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐసీసీ ప్రపంచకప్‌ ఈవెంట్లో నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జోడీగా రికార్డు సాధించారు.

అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు
అంతకు ముందు.. 1983లో నాటింగ్‌హాంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌, జహీర్‌ అబ్బాస్‌ 147* పరుగులు, అదే టోర్నీలో లీడ్స్‌ మ్యాచ్‌లో షాహిద్‌ మహబూబ్‌తో కలిసి ఇమ్రాన్‌ ఖాన్‌ 144.. 2019లో బర్మింగ్‌హాంలో బాబర్‌ ఆజం- హ్యారిస్‌ సొహైల్‌ 126 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

ఇక వరల్డ్‌కప్‌ డెబ్యుటెంట్స్‌ ఒకే మ్యాచ్‌లో ఫిఫ్టీ ప్లస్‌ సాధించిన పాక్‌ ఆటగాళ్ల జాబితాలో మజీద్‌ ఖాన్‌(65), ఆసిఫ్‌ ఇక్బాల్‌(53)(1975లో ఆస్ట్రేలియా మీద), మిస్బా ఉల్‌హక్‌(65), ఉమర్‌ అక్మల్‌(71)- (2011లో కెన్యా మీద) తర్వాతి స్థానాల్లో రిజ్వాన్‌(65), సౌద్‌ షకీల్‌(68)-(2023లో హైదరాబాద్‌లో) నిలిచారు. 

చదవండి: పాకిస్తాన్‌కు ఘోర ఓటమి.. ఫైనల్లో టీమిండియాతో అఫ్గన్‌ 

Videos

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)