WC 2023: రచిన్‌ రవీంద్ర.. మొన్న సెంచరీ.. ఇప్పుడేమో!

Published on Mon, 10/09/2023 - 18:04

ICC Cricket World Cup 2023 - New Zealand vs Netherlands: వన్డే వరల్డ్‌కప్‌-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బ్యాటర్లు అదరగొట్టారు. విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, టామ్‌ లాథమ్‌ అర్ధ శతకాలతో చెలరేగి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. కాగా ఉప్పల్‌లో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన డచ్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

మూడు హాఫ్‌ సెంచరీలు
ఈ క్రమంలో స్కాట్‌ ఎడ్వర్డ్‌ బృందం ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు డెవాన్‌ కాన్వే(32), విల్‌ యంగ్‌ శుభారంభం అందించారు. గత మ్యాచ్‌ సెంచరీ హీరో, వన్‌డౌన్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర ఈసారి 51 పరుగులతో రాణించగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన డారిల్‌ మిచెల్‌ 48, కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ 53 పరుగులతో అదరగొట్టారు.

సాంట్నర్‌ మెరపులు
అయితే, ఈ మ్యాచ్లో గ్లెన్‌ ఫిలిప్స్‌(4) పూర్తిగా నిరాశపరచగా.. మార్క్‌ చాప్‌మన్‌ 5 పరుగులు మాత్రమే చేశాడు. ఎనిమిదో స్థానంలో వచ్చిన మిచెల్‌ సాంట్నర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇక.. తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్‌ చేసిన మ్యాట్‌ హెన్రీ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్‌ 322 పరుగులు చేసింది. 

నెదర్లాండ్స్‌కు కష్టమే!
నెదర్లాండ్స్‌ బౌలర్లలో వాన్‌ డెర్‌ మెర్వే, పాల్‌ వాన్‌ మెకెరెన్‌, ఆర్యన్‌ దత్‌ రెండేసి వికెట్లు తీయగా.. ఆల్‌రౌండర్‌ బాస్‌ డి లిడేకు ఒక వికెట్‌ దక్కింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్‌ విధించిన 323 పరుగుల లక్ష్యాన్ని డచ్‌ టీమ్‌ ఛేదించడం కష్టంగానే కనిపిస్తోంది!

ఇదిలా ఉంటే.. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. నెదర్లాండ్స్‌.. ఉప్పల్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 81 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. మరి ఇదే వేదికపై మరోసారి పటిష్ట కివీస్‌తో తలపడుతున్న డచ్‌ జట్టు పరిస్థితి ఎలా ఉండబోతుందో!?

చదవండి: CWC 2023: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం.. షాకిచ్చిన ఐసీసీ

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)