Breaking News

పాకిస్తాన్‌ బౌలింగ్‌ను చిత్తు చేసి.. భారీ స్కోరుతో రికార్డులు సృష్టించిన న్యూజిలాండ్‌

Published on Sat, 11/04/2023 - 15:03

వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించింది. పాక్‌ పేసర్ల బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న కివీస్‌ బ్యాటర్లు జట్టుకు రికార్డు స్థాయి స్కోరు అందించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో హసన్‌ అలీ కివీస్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వేను 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మళ్లీ వికెట్ల కోసం ప్రయత్నించిన పాక్‌ బౌలింగ్‌ విభాగానికి.. మరో ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కొరకరాని కొయ్యలా తయారయ్యారు.

రచిన్‌ 108, కేన్‌ విలియమ్సన్‌ 95 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ జోడీని ఇఫ్తికార్‌ అహ్మద్‌ విడదీసినా అప్పటికే భారీ స్కోరుకు బలమైన పునాది పడింది. ఇక మిగిలిన వాళ్లలో డారిల్‌ మిచెల్‌ 29, మార్క్‌ చాప్‌మన్‌ 39, గ్లెన్‌ ఫిలిప్స్‌ 41, మిచెల్‌ శాంట్నర్‌ 26 పరుగులు(నాటౌట్‌) సాధించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్‌ 401 పరుగులు స్కోరు చేసింది. 

తద్వారా చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. అదే విధంగా.. వరల్డ్‌కప్‌ ఈవెంట్లో సౌతాఫ్రికా(3 సార్లు) తర్వాత టీమిండియా, ఆస్ట్రేలియాతో కలిసి 400+ స్కోరు నమోదు చేసిన నాలుగో జట్టుగా అవతరించింది.

అంతేకాదు.. వన్డేల్లో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు సాధించిన రెండో జట్టుగా కివీస్‌ చరిత్ర సృష్టించింది. గతంలో ఇంగ్లండ్‌ పాక్‌తో 2016 నాటి మ్యాచ్‌లో 444/3 స్కోరు నమోదు చేసింది. 

వీటితో పాటు మరో అరుదైన ఘనతను కూడా న్యూజిలాండ్‌ జట్టు తమ ఖాతాలో వేసుకుంది. వరల్డ్‌కప్‌ చరిత్రలో పాకిస్తాన్‌ మీద అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సాధించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)