amp pages | Sakshi

WC 2023: ఆ ఇద్దరు వరల్డ్‌కప్‌ జట్టులో వద్దు! ‘చీఫ్‌ సెలక్టర్‌’గా చెబుతున్నా

Published on Sat, 01/07/2023 - 13:04

ICC ODI World Cup 2023- Team India: వన్డే వరల్డ్‌కప్‌-2023 నేపథ్యంలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్లుగా ఎదుగుతున్న ఓ ఇద్దరు ఆటగాళ్లకు తన జట్టులో చోటు ఇచ్చేది లేదని పేర్కొన్నాడు. తానే గనుక బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ పదవిలో ఉంటే ప్రపంచకప్‌ జట్టు ఇలాగే ఉండాలని కోరుకుంటానంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

వాళ్లు నలుగురు చాలు
స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో చిక్కా మాట్లాడుతూ.. ‘‘నా వరల్డ్‌కప్‌ జట్టులో శుబ్‌మన్‌ గిల్‌​, శార్దూల్‌ ఠాకూర్‌కు చోటు లేదు. ఇక పేసర్ల విషయానికొస్తే.. నలుగురు చాలు. బుమ్రా, ఉమ్రాన్‌ మాలిక్‌ , అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌ జట్టులో ఉంటే సరిపోతుంది. షమీ సో-సోగా ఆడతాడు.

కాబట్టి తను అవసరం లేదు. దీపక్‌ హుడా జట్టులో ఉంటే బాగుంటుంది. వీళ్లందరికి జట్టును గెలిపించగల సత్తా ఉంది. అయితే, ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల యూసఫ్‌ పఠాన్‌ వంటి రేసు గుర్రాలు జట్టులో ఉండాలని కోరుకుంటాం కదా! నా వరకైతే అలాంటి గెలుపు గుర్రం రిషభ్‌ పంత్‌.


క్రిష్ణమాచారి శ్రీకాంత్‌

పంత్‌ ఉంటేనే
పదింట మూడు మ్యాచ్‌లను గెలిపించినా నేను వాళ్లకే పెద్దపీట వేస్తాను. కీలక సమయంలో జట్టును గెలిపించే వాళ్లు కావాలి. పంత్‌ అలాంటి వాడే! ఇలాంటి ఆటగాళ్ల నుంచి నిలకడైన ప్రదర్శన కోరుకోకూడదు.

రిషభ్‌ పంత్‌కు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉంది కాబట్టి తను ఉంటే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. టీమిండియా అభిమానిగా కాకుండా.. చీఫ్‌ సెలక్టర్‌ పదవిలో ఉన్నాననుకుని ఈ మాటలు మాట్లాడానంటూ ఈ మాజీ సెలక్టర్‌ పేర్కొన్నాడు.

ఓపెనింగ్‌ స్థానం కోసం తీవ్ర పోటీ
సొంతగడ్డపై ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ 20 మందితో జట్టును సిద్ధం చేస్తున్న వేళ శ్రీకాంత్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. శిఖర్‌ ధావన్‌ స్థానంలో యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్న తరుణంలో చిక్కా.. అతడికి తన జట్టులో చోటివ్వనని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మకు జోడీగా రాహుల్‌తో పాటు యువ ప్లేయర్లు ఇషాన్‌ కిషన్‌, గిల్‌ ఓపెనింగ్‌ స్థానం కోసం పోటీపడుతున్నారు.

చదవండి: Sarfaraz Ahmed: నీ కెరీర్‌ ముగిసిపోయిందన్నాడు! రమీజ్‌ రాజాకు దిమ్మతిరిగేలా కౌంటర్‌!
Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్‌ ఎంట్రీ!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)