అతడు ఉండగా అక్షర్‌ ఎందుకు? మ్యాచ్‌ విన్నర్‌కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్‌

Published on Tue, 09/05/2023 - 15:35

India's ODI World Cup 2023 Squad: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుపై హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. మ్యాచ్‌ విన్నర్‌కు చోటు లేకపోవడం ఏమిటంటూ ‘ఎక్స్‌’ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి మంగళవారం ప్రపంచకప్‌ జట్టును ప్రకటించాడు.

ఈసారి కూడా మొండిచేయి!
ఇందులో.. ఏడుగురు బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, నలుగురు ఆల్‌రౌండర్లకు చోటు దక్కింది. అయితే, ఆసియా కప్‌ జట్టులో స్థానం లేనప్పటికీ అనుభవం దృష్ట్యానైనా మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌కు ఈసారి అవకాశం ఇస్తారని అంతా భావించారు. 


చహల్‌

కానీ.. ఆసియా కప్‌ జట్టు ప్రకటన సందర్భంగా.. ఇకపై రిస్ట్‌ స్పిన్నర్లు కుల్‌-చా ద్వయాన్ని ఒకే జట్టులో చూడలేమన్న మాటలను నిజం చేస్తూ అగార్కర్‌.. చహల్‌పై వేటు పడటానికి కారణాన్ని చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌ జట్టులో చైనామన్‌ స్పిన్నర్‌కు చోటు దక్కగా.. చహల్‌కు భంగపాటు తప్పలేదు.

ఆశ్చర్యం వేసింది
ఈ విషయంపై స్పందించిన మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌.. ‘‘ప్రపంచకప్‌ జట్టులో యజువేంద్ర చహల్‌కు చోటు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ప్యూర్‌ మ్యాచ్‌ విన్నర్‌ తను’’ అని ట్వీట్‌ చేశాడు.ఘీ క్రమంలో నెటిజన్లు సైతం యుజీకి మద్దతు తెలుపుతూ భజ్జీని సమర్థిస్తున్నారు. చహల్‌తో పాటు వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు కూడా అన్యాయం జరిగిందని మరికొంత మంది వాపోతున్నారు.

అక్షర్‌ వద్దు.. ఎందుకంటే!
తన వరల్డ్‌కప్‌ జట్టులో యజువేంద్ర చహల్‌కు చోటిచ్చిన హర్భజన్‌ సింగ్‌.. అక్షర్‌ పటేల్‌ను విస్మరించిన విషయం తెలిసిందే. ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘రవీంద్ర జడేజా.. అక్షర్‌ పటేల్‌ ఇద్దరూ ఒకేలాంటి ప్లేయర్లు. చహల్‌ బౌలింగ్‌ శైలి వేరు. అతడు మ్యాచ్‌ విన్నర్‌.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడి గణాంకాలు గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. వన్డే, టీ20లలో చహల్‌ లాంటి ప్రభావంతమైన స్పిన్నర్‌ లేడనే చెప్పాలి. జడ్డూ ఎలాగో జట్టులో ఉంటాడు కాబట్టి.. అక్షర్‌ను పక్కనపెట్టి యుజీని తీసుకుంటే బాగుంటుంది అని వరల్డ్‌కప్‌ జట్టు ప్రకటనకు ముందు భజ్జీ తన అంచనా తెలియజేశాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023కి హర్భజన్‌ ఎంచుకున్న జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్.

చదవండి:  తిలక్‌తో పాటు అతడికి నో ఛాన్స్‌! ఇదే ఫైనల్‌.. మార్పుల్లేవు: అజిత్‌ అగార్కర్‌

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)