భారత్‌లో అడుగుపెట్టిన ఆసీస్‌ క్రికెటర్లు.. వార్నర్‌ పోస్ట్‌ వైరల్‌

Published on Wed, 09/20/2023 - 15:42

Ind Vs Aus: David Warner Thrilled To Be Back In India: సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న ఆస్ట్రేలియా టీమిండియాతో సిరీస్‌కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన కంగారూలు.. వన్డే సిరీస్‌ను మాత్రం 3-2తో చేజార్చుకున్నారు. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్‌-2023కి ముందు చివరిసారిగా రోహిత్‌ సేనతో తలపడనున్నారు. 

ఈ నేపథ్యంలో ఆసీస్‌ క్రికెటర్లు భారత్‌కు చేరుకున్నారు. వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సహా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ, మిచెల్‌ మార్ష్‌ తదితరులు ఇండియాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వార్నర్‌ భాయ్‌ భావోద్వేగ నోట్‌ షేర్‌ చేశాడు.

జాగ్రత్తగా చూసుకుంటారు
‘‘ఇండియాలో మళ్లీ అడుగుపెట్టడం.. ఎల్లప్పుడూ గొప్పగానే అనిపిస్తుంది. ఇక్కడ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు’’ అంటూ భద్రతా సిబ్బందితో దిగిన ఫొటోను పంచుకున్నాడు. మరోవైపు.. తాము హోటల్‌ గదిలో సేద తీరుతున్న ఫొటోలను అలెక్స్‌ క్యారీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

కాగా ప్రొటిస్‌తో తొలి రెండు వన్డేల్లో వరుసగా 106, 78 పరుగులు సాధించిన 36 ఏళ్ల వార్నర్‌.. మలి మూడు మ్యాచ్‌లలో కనీసం 20 పరుగులు మార్కును కూడా దాటలేక విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్‌కు ముందు ఈ వెటరన్‌ బ్యాటర్‌.. టీమిండియాతో సిరీస్‌లో ఏ మేరకు రాణిస్తాడో చూడాల్సి ఉంది.

స్టార్లు తిరిగి వచ్చారు
భారత్‌తో వన్డే సిరీస్‌లో ఈ లెఫ్టాండర్‌.. మిచెల్‌ మార్ష్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. గాయాల కారణంగా ఇన్నాళ్లు జట్టుకు దూరమైన కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తిరిగి రావడం ఆసీస్‌కు ఉత్సాహాన్నిస్తోంది.

ఇక సెప్టెంబరు 22-27 వరకు మొహాలీ, ఇండోర్‌, రాజ్‌కోట్‌లలో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌లు జరుగునున్నాయి. అదే విధంగా ఇరు జట్లు అక్టోబరు 8న తమ వరల్డ్‌కప్‌ ప్రయాణం ఆరంభించనున్నాయి. 

చదవండి: సిరాజ్‌ మియా.. మరోసారి వరల్డ్‌ నంబర్‌ 1 బౌలర్‌గా.. ఏకంగా..
అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్‌.. వీడియో వైరల్‌

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)