Breaking News

IML 2025: వాట్సన్‌ విధ్వంసకర సెంచరీ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఆసీస్‌

Published on Sat, 03/08/2025 - 08:33

అంతర్జాతీయ మాస్టర్స్‌ లీగ్‌-2025లో ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్టు తమ దూకుడును కొనసాగిస్తోంది. వడోదరగా వేదికగా సౌతాఫ్రికా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఒక్క వికెట్‌ నష్టానికి 260 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

ఆసీస్‌ కెప్టెన్‌ షేన్‌ వాట్సన్‌​ మరోసారి సెంచరీతో చెలరేగాడు. సౌతాఫ్రికా బౌలర్లను వాట్సన్‌ ఊచకోత కోశాడు. వాట్సన్‌ కేవలం 61 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో వాట్సన్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం​.

అంతకుముందు వెస్టిండీస్‌, భారత్‌పై వాట్సన్‌ శతక్కొట్టాడు.  ఈ మ్యాచ్‌లో షేన్‌తో పాటు కల్లమ్ ఫెర్గూసన్(43 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85), బెన్‌ డంక్‌(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రోటీస్‌ బౌలర్లలో పీటర్సన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

నిప్పులు చెరిగిన ఆసీస్‌ బౌలర్లు..
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 17 ఓవర్లలో కేవలం 123 పరుగులకే ఆలౌటైంది. కంగారుల బౌలర్ల దాటికి ప్రోటీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పేక మేడలా కుప్పకూలింది. హషీమ్ ఆమ్లా(30) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రిచర్డ్‌ లివి(22), పీటర్సన్‌ పర్వాలేదన్పించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

ఆసీస్‌ బౌలర్లలో బెన్‌ లాఫ్లీన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. దొహర్టీ, మెక్‌గైన్‌ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు కౌల్టర్‌ నైల్‌, నాథన్ రియర్డన్ చెరో వికెట్‌ పడగొట్టారు. ఇక శనివారం జరగనున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌, భారత్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ గెలిస్తే భారత్‌ తమ సెమీస్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.
చదవండి: CT 2025: భార‌త్-న్యూజిలాండ్ ఫైన‌ల్ పోరు.. బ్యాట‌ర్ల‌కు చుక్క‌లే! ఎందుకంటే?
 

Videos

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)