Breaking News

ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రాహుల్‌, సూర్యకుమార్‌కు నో ఛాన్స్‌!

Published on Thu, 02/16/2023 - 10:51

తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో అదే జట్టుతో అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమైంది. ఇరు జట్లు మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం భారత తుది జట్టును టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ అంచనా వేశాడు.

తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌కు తను ఎంపిక చేసిన జట్టులో జాఫర్‌ చోటివ్వలేదు. రాహుల్‌ స్థానంలో యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు, సూర్యకుమార్‌ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌కు అవకాశం ఇచ్చాడు. కాగా శ్రేయస్‌ అయ్యర్‌ గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరాడు.

ఈ క్రమంలో అతడు ఢిల్లీ టెస్టు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు బీసీసీఐ కూడా దృవీకరించింది. ఇక రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ తొలి టెస్టులో తీవ్రంగా నిరాశపరిచారు. రాహుల్‌ 20 పరుగులు చేసి పెవిలియన్‌ చేరగా.. సూర్య తన అరంగేట్ర టెస్టులో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరిని ఢిల్లీ టెస్టుకు దూరం పెట్టాలని పలువరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాఫర్‌ కూడా తన అంచనా వేసిన జట్టులో వీరిద్దరికి చోటివ్వకపోవడం గమానార్హం.

తొలి టెస్ట్‌ కోసం వసీం జాఫర్‌ ఎంచుకున్న తుది జట్టు..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, శ్రీకర్‌ భరత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌
చదవండి: West Indies: వెస్టిండీస్‌ టీ20 కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)