Breaking News

'టీమిండియా ఓడిపోయినందుకు బాధ లేదు.. కానీ అదొక్క‌టే సమస్య'

Published on Thu, 08/08/2024 - 12:32

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. వ‌న్డే సిరీస్‌లో మాత్రం ఘోర ప‌ర‌భావాన్ని మూట‌గ‌ట్టుకుంది. మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 0-2 తేడాతో ఓట‌మి పాలైంది. శ్రీలంక‌పై వ‌న్డే సిరీస్‌ను భార‌త్ కోల్పోవ‌డం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

తొలి వ‌న్డేను టైగా ముగించిన రోహిత్ సేన‌.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మి చ‌విచూసింది. భార‌త హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు ఇదే తొలి సిరీస్ ఓట‌మి కాగా.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ విజ‌యం త‌ర్వాత రోహిత్ శ‌ర్మ‌కు కూడా మొద‌టి ప‌రాజ‌యం. 

ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ ఓపెన‌ర్ వ‌సీం జాఫ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భాగంగా జ‌రిగిన ఈ సిరీస్‌లో భార‌త్ ఓడిపోవ‌డం ఆందోళ‌న కలిగిస్తోంద‌ని జాఫ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

"ఈ సిరీస్‌లో శ్రీలంక అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. క‌చ్చితంగా ఈ సిరీస్ విజ‌యానికి వారే అర్హులు. అయితే భార‌త్ సిరీస్ ఓడిపోయినందుకు నాకు ఎటువంటి బాధ లేదు. ఆట‌లో గెలుపు ఓటములు స‌హ‌జ‌మే.

కానీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు భార‌త్ ఇటువంటి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచ‌డం కాస్త ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఎందుకంటే ఈ  మెగా టోర్నీకి ముందు భార‌త్ కేవ‌లం మూడు వ‌న్డేల మాత్ర‌మే ఆడ‌నుందని" ఎక్స్‌లో జాఫ‌ర్ రాసుకొచ్చాడు. 

ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భార‌త్‌కు ఇంకా కేవ‌లం మూడు వ‌న్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి.  ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ఇంగ్లండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్ భార‌త్ ఆడ‌నుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)