Breaking News

బ్యాటింగ్‌ చేయడు.. బౌలింగ్‌ చేయడు? అతడు జట్టులో అవసరమా?

Published on Sat, 07/11/2026 - 13:20

భార‌త క్రికెట్ జ‌ట్టు టీ20ల్లో వ‌రుస ఓట‌ముల‌తో సత‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలో టీమిండియా పేల‌వ ఆట తీరు కార‌ణంగా ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ల‌ను కోల్పోయింది.

ఈ నేపథ్యంలో టీమ్ మేనెజ్‌మెంట్‌పై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ప్రశ్నల వర్షం కురిపించాడు. భారత టీ20 జట్టులో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎందుకు ఉన్నాడో తనకు ఆర్ధం కావడం లేదని జాఫర్ అన్నాడు. సుందర్‌ స్దానంలో మరొక ఆటగాడికి అవకాశమిస్తే బాగుంటుందని అతడు అభిప్రాయపడ్డాడు.

"వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను ఏప్రాతిపదికన భారత టీ20 జట్టులో కొనసాగిస్తున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. అతడి ఎంపిక నన్ను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. సుందర్‌ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటో కూడా తెలియడం లేదు.  అతడిని ఫినిషర్‌గా ఆడించలేరు, అలాగని టాప్ ఆర్డర్‌లోనూ కూడా చోటు లేదు. 

ఇది మొదటి సమస్య. ఇక రెండో విషయానికొస్తే.. అతడు నిలకడగా నాలుగు ఓవర్లు వేసే బౌలర్ కూడా కాదు. అలాంటప్పుడు అతడిని ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారు? ఎవరికైనా తెలిస్తే నాకు కాస్త చెప్పండి. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఆడ‌క‌పోతే అత‌డికి ప్ర‌త్నామ్నాయంగా కుల్దీప్ యాద‌వ్ లేదా మరెవరినైనా పరిశీలించాలి. 

శివాంగ్ కుమార్ రూపంలో భార‌త్‌కు మ‌రో మంచి స్పిన్ ఆప్ష‌న్ కూడా ఉంది. మిడిల్ ఓవ‌ర్ల‌లో వికెట్లతో పాటు ప‌రుగులు క‌ట్ట‌డి చేసే ఇద్ద‌రు స్పిన్న‌ర్లు  భార‌త్‌కు అవ‌స‌రం. కానీ ప్రస్తుతం భార‌త జ‌ట్టులో వ‌రుణ్ రూపంలో ఒక్క‌డే మంచి స్పిన్న‌ర్ క‌నిపిస్తున్నాడు" అని జాఫ‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.

వాస్తవానికి జాఫర్ ఒక్కడే కాదు చాలా మంది మాజీలు కూడా సుందర్ రోల్ ఎంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంగ్లండ్ టూర్‌లో తొలి మూడు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన సుందర్‌ను.. నాలుగో టీ20లో మాత్రం ఆడించారు. వరుణ్ చక్రవర్తి  గాయం బారిన పడడంతో సుందర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కింది.

కానీ సుంద‌ర్ మాత్రం త‌న ల‌భించిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌రుచుకోలేక‌పోయాడు. బ్యాటింగ్‌లో కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే చేసిన సుంద‌ర్‌.. అనంత‌రం ఒక్క ఓవ‌ర్ బౌలింగ్ చేసి 19 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. గ‌త కొన్ని మ్యాచ్‌ల‌ను గ‌మ‌నిస్తే సుంద‌ర్ ఒక‌ట్రెండు ఓవ‌ర్లు మిన‌హా ఎక్కువ బౌలింగ్ చేయ‌డం లేదు.  పోనీ బ్యాట‌ర్‌గా అయిన స‌క్సెస్ అవుతాన్నాడంటే అది కూడా లేదు. అలాంటప్పుడు అత‌డిని ఒక ఆల్‌రౌండ‌ర్‌గా ఎలా ఆడిస్తున్నారో మేనెజ్‌మెంట్‌కే తెలియాలి .
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)