సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది.. ప్రతి 4-7 రోజులకోసారి వెటాడ్తది..!

Published on Mon, 01/16/2023 - 17:00

Wasim Jaffer On Virat Kohli: తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకం బాదిన టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం‍ కురిపిస్తున్న వేల భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ చేసిన కొన్ని ఆసక్తికర ట్వీట్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వన్డేల్లో 46వ శతకాన్ని, ఓవరాల్‌గా 74వ అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసుకుని, పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లిని ఉద్దేశిస్తూ జాఫర్‌ ఈ రకంగా ట్వీటాడు. 

సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది, ఈ ఏడాది ఈ పులి వేట పెద్ద ఎత్తున సాగుతుంది.. పులి ఏరకంగా అయితే ప్రతి 4-7 రోజులకోసారి వేటాడ్తదో, కోహ్లి కూడా అదే గ్యాప్‌లో తన సెంచరీల దాహాన్ని తీర్చుకుంటాడు.. బహుపరాక్‌ అని అర్ధం వచ్చేలా జాఫర్‌ తన ట్వీట్ల ద్వారా ప్రత్యర్ధులను హెచ్చరించాడు. ఈ ట్వీట్లకు కోహ్లి ఫ్యాన్స్‌ తెగ లైకులు కొడుతూ, కోహ్లి-పులి కామెంట్స్‌ను ఆస్వాధిస్తున్నారు. 

కాగా, మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన కెరీర్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ (టీ20 ఆసియా కప్‌ 2022లో ఆఫ్ఘనిస్తాన్‌పై) పూర్తి చేసిన కోహ్లి, ఆ తర్వాత మూడు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్‌పై వన్డే సెంచరీ, ఆతర్వాత మూడు వారాల బ్రేక్‌లో శ్రీలంకపై తొలి వన్డేలో సెంచరీ, ఆతర్వాత నాలుగు రోజుల గ్యాప్‌లో మరో సెంచరీ సాధించాడు. మొత్తంగా మూడేళ్ల తర్వాత మునుపటి ఫామ్‌ను అందుకున్న కింగ్‌ కోహ్లి.. గత 4 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు చేసి, కోహ్లి ఈజ్‌ బ్యాక్‌ అని చాటుకున్నాడు. కోహ్లి ప్రస్తుత ఫామ్‌ చూస్తే.. జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభంకాబోయే వన్డే సిరీస్‌లోనూ సెంచరీల మోత మోగడం ఖాయమని అర్ధమవుతుంది. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)