Breaking News

అత‌డెందుకు దండ‌గ అన్నారు.. కట్ చేస్తే! 7 వికెట్ల‌తో

Published on Thu, 10/24/2024 - 18:34

అత‌డిని ఎందుకు ఎంపిక చేశారు?  కుల్దీప్ యాద‌వ్ కన్న తోపు స్పిన్న‌రా? అస‌లు రోహిత్ శ‌ర్మ‌, గంభీర్‌కు ఏమైంది? ఇవన్నీ న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయడంపై మాజీలు సంధించిన విమర్శల బాణాలు. అయితే మ్యాచ్ ఆరంభం తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. సుందర్‌ను విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అం‍టున్నాయి.

45 నెలల తర్వాత..
కివీస్ తొలి టెస్టు ఓటమి అనంతరం మిగిలిన రెండు టెస్టులకు అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్‌ను భారత జట్టులోకి బీసీసీఐ చేర్చింది. రంజీ ట్రోఫీలో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సుందర్ అర్ధాంతరంగా పుణేలో టీమిండియాతో చేరాడు. అయితే అతడిని కేవలం బ్యాకప్‌గానే తీసుకున్నారని అంతా భావించారు.

కానీ రెండో టెస్టుకు టీమిండియా మెనెజ్‌మెంట్ తుది జట్టులో వాషీకి చోటిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ స్పిన్నర్‌ను తీసుకురావడాన్ని పలువురు మాజీలు తప్పుబట్టారు. అయితే 45 నెలల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన సుందర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచి అందరి అంచనాలను తలకిందలు చేశాడు. 

ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్‌ను నామమాత్రపు ‍స్కోర్‌కే పరిమితం చేశాడు. బంతిని గింగరాలు తిప్పుతూ న్యూజిలాండ్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. తొలి స్పెల్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సుందర్‌.. రెండో స్పెల్‌లో రవీంద్రను ఔట్ చేసి తన వికెట్ల వేటను మొదలు పెట్టాడు.

 ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్‌.. 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. సుందర్‌ ఈ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేయడం విశేషం. అంతేకాకుండా టెస్టుల్లో ఈ తమిళ తంబీ ఐదు వికెట్ల కంటే ఎక్కువ పడగొట్టడం ఇదే తొలిసారి.

కివీస్@259
ఇక  ఈ మ్యాచ్‌లో ప‌ర్యాట‌క కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డెవాన్ కాన్వే(76) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌చిన్ ర‌వీంద్ర‌(65) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.  భారత బౌలర్లలో సుందర్‌తో పాటు మరో తమిళనాడు స్పిన్నర్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా  వికెట్ న‌ష్టానికి 16 ప‌రుగులు చేసింది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)