టీమిండియాకు ఎదురుదెబ్బ.. గాయంతో ఆల్‌రౌండర్‌ దూరం!

Published on Fri, 07/17/2026 - 12:55

ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో పరాజయం చవిచూసిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డేలో మెరుపు అర్ధసెంచరీతో టీమిండియాను గెలిపించిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో సిరీస్‌లో మిగిలిన వన్డేకు దూరమైనట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా బ్యాటింగ్‌కు ముందే వాషింగ్టన్ సుందర్ కండరాల నొప్పితో బాధపడ్డాడు. 

ఫిజియో వద్ద చికిత్స తీసుకొని మైదానంలోకి అడుగుపెట్టిన సుందర్ 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో సుందర్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో సుందర్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంగ్లండ్ సిరీస్‌లో చివరి వన్డేకు దూరమైనట్లు తెలుస్తోంది. 

అతడు కోలుకోవడానికి రెండు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశముందని సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ లెక్కన శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సుందర్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 26 ఏళ్ల సుందర్ ప్రస్తుతం టీమిండియాలో అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 18 టెస్టుల్లో 41 వికెట్లు తీయడంతో పాటు 937 పరుగులు సాధించాడు.

వదలని గాయాల బెడద
వరుస సిరీస్‌లతో బిజీగా గడుపుతున్న టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి గాయాలతో ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యారు. తాజాగా వాషింగ్టన్ సుందర్ దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక సుందర్‌కు గాయాలు కొత్తేమి కాదు. ఈ ఏడాది ఆరంభంలో పక్కటెముకల్లో ఫ్రాక్చర్ కావడంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న సుందర్ 2026 టీ20 ప్రపంచకప్ మధ్యలో జట్టులో జాయిన్ అయ్యాడు.

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)