వావ్! సుంద‌ర్ స్పిన్‌ మ్యాజిక్‌.. దెబ్బ‌కు ర‌వీంద్ర మైండ్‌ బ్లాంక్‌( వీడియో)

Published on Fri, 10/25/2024 - 15:28

పుణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో భార‌త ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌న స్పిన్ మ‌యాజాలాన్ని కొన‌సాగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాట‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌ను అద్బుత‌మైన బంతితో బోల్తా కొట్టించిన సుంద‌ర్‌.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే తీరులో ఔట్ చేశాడు.

సుంద‌ర్ సంధించిన డెలివ‌రీకి ర‌వీంద్ర ద‌గ్గ‌ర స‌మాధాన‌మే లేకుండా పోయింది. సంచ‌ల‌న బంతితో వాషింగ్ట‌న్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్ 22 ఓవ‌ర్ వేసిన వాషీ ఐదో బంతిని కొంచెం వేగంతో లెంగ్త్ డెలివ‌రీగా ర‌చిన్‌కు సంధించాడు. 

అయితే ఆ డెలివ‌రీని ర‌చిన్ క‌ట్ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి మాత్రం అత‌డి బ్యాట్‌కు మిస్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన‌ ర‌చిన్ ఒక్క‌సారిగా బిత్త‌ర పోయాడు. దీంతో కేవ‌లం 9 ప‌రుగులు మాత్ర‌మే చేసి ర‌చిన్ మైదానాన్ని వీడాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో కివీస్‌ ప‌ట్టు బిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

ప్రస్తుతం బ్లాక్‌ క్యాప్స్‌ 250 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. కివీ స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌ 7 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు.

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)