Breaking News

వ‌ర‌ల్డ్‌ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లోనే

Published on Thu, 10/24/2024 - 19:53

పుణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో భార‌త స్పిన్న‌ర్లు స‌త్తాచాటారు. ఆఫ్ స్పిన్న‌ర్లు వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌లు బంతితో మ్యాజిక్ చేశారు. తమ స్పిన్ మ‌యాజాలంతో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు.

ఈ ఇద్ద‌రు త‌మిళ తంబీల దాటికి కివీస్ బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. అయితే తొలుత అశ్విన్ వికెట్ల వేటను మొద‌లు పెట్టగా.. సుంద‌ర్ ముగించాడు. కివీస్ మొత్తం ప‌ది వికెట్ల‌ను ఈ ఇద్ద‌రే ప‌డ‌గొట్టారు.

వాషింగ్ట‌న్ ఏకంగా 7 వికెట్లు ప‌డ‌గొట్టగా.. అశ్విన్ 3 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ 10 వికెట్లు ప‌డ‌గొట్టిన అశ్విన్‌-సుంద‌ర్ జోడీ ప‌లు అరుదైన ఘ‌న‌త‌ల‌ను త‌న పేరిట లిఖించుకున్నారు.

వ‌ర‌ల్డ్ రికార్డు..
→టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు ప‌డ‌గొట్టిన ఆఫ్-స్పిన్ జోడీగా అశ్విన్‌-సుంద‌ర్ నిలిచారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్ట‌రీలో ఈ ఘ‌న‌త‌ ఎవ‌రికి సాధ్యం కాలేదు.

→అదే విధంగా టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు ప‌డ‌గొట్టిన భార‌త‌ ఆఫ్ స్పిన్ జోడీ కూడా వీరిద్ద‌రే కావడం విశేషం.వీరికంటే ముందు ఏ భార‌త కుడిచేతి వాటం స్పిన్న‌ర్లు కూడా ఈ ఫీట్ సాధించ‌లేక‌పోయారు.

→మ‌రోవైపు భారత్‌ గడ్డపై టెస్టుల్లో తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో పది వికెట్లు స్పిన్నర్లే తీయడం ఇది ఆరోసారి. ఈ ఘనతను అంతకంటే ముందు భారత్ నాలుగు సార్లు సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి సాధించింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)