Breaking News

చ‌రిత్ర సృష్టించిన వాషింగ్టన్‌.. తొలి భారత ప్లేయర్‌గా

Published on Thu, 10/24/2024 - 20:49

పుణే వేదికగా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక న్యూజిలాండ్‌ జట్టు 259 ప‌రుగులకు ఆలౌటైంది. భార‌త స్పిన్న‌ర్ల దాట‌కి కివీస్ ఓ మోస్తారు స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. ఆఫ్ స్పిన్న‌ర్లు వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, అశ్విన్ ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌కు ముప్పు తిప్పులు పెట్టారు. ముఖ్యంగా వాషింగ్టన్‌ సుందర్ అయితే త‌న రీ ఎంట్రీలో స‌త్తాచాటాడు. 

దాదాపు 3 ఏళ్ల త‌ర్వాత భార‌త టెస్టు జ‌ట్టులోకి వ‌చ్చిన సుంద‌ర్‌.. త‌న స్పిన్ మ‌యాజాలంతో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఏకంగా 7 వికెట్లు ప‌డ‌గొట్టి కివీస్‌ను దెబ్బ‌తీశాడు. టెస్టుల్లో 5 వికెట్లు పైగా సుందర్‌ పడగొట్టడం తన కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం.

అరుదైన ఘ‌న‌త‌..
ఇక మొద‌టి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు ప‌డ‌గొట్టిన వాషింగ్ట‌న్ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో పూణెలోని ఏంసీఎ స్టేడియంలో ఐదు వికెట్ల ఘ‌న‌త సాధించిన తొలి భార‌త బౌల‌ర్‌గా సుంద‌ర్ నిలిచాడు. ఓవ‌రాల్‌గా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయ‌ర్‌గా సుంద‌ర్ నిలిచాడు. 

సుంద‌ర్ కంటే ముందు ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ స్టీఫెన్ ఒకీఫ్ పుణే మైదానంలో 5 వికెట్ల హాల్ న‌మోదు చేశాడు. న్యూజిలాండ్‌పై  7 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో భార‌త్‌ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సుంద‌ర్ కంటే ముందు ఎస్ వెంకటరాఘవన్, ఎరపల్లి ప్రసన్న, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.
చదవండి: IND vs NZ: వ‌ర‌ల్డ్‌ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లోనే

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)