Breaking News

వారెవ్వా వాషింగ్ట‌న్‌.. దెబ్బకు కివీస్ ప్లేయర్ల ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో

Published on Thu, 10/24/2024 - 15:08

పుణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో భార‌త‌ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌న స్పిన్ మ‌యాజాలాన్ని ప్ర‌ద‌ర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాట‌ర్లు ర‌చిన్ ర‌వీంద్ర‌, టామ్ బ్లండెల్,  డార్లీ మిచెల్‌ను అద్బుత‌మైన బంతుల‌తో సుంద‌ర్‌ బోల్తా కొట్టించాడు.

ముఖ్యంగా ర‌వీంద్ర‌, బ్లండెల్‌ను వాషీ ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. కుల్దీప్ యాద‌వ్ స్ధానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన సుంద‌ర్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వ‌చ్చాడు.

తొలి స్పెల్‌లో అద్బుతంగా బౌలింగ్ చేసిన సుంద‌ర్‌ను కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌ళ్లీ 59 ఓవ‌ర్ల త‌ర్వాత ఎటాక్‌లో తీసుకువ‌చ్చాడు. అప్ప‌టికే క్రీజులో పాతుకుపోయిన ర‌చిన్ ర‌వీంద్ర‌ను పెవిలియ‌న్‌కు పంపేందుకు హిట్‌మ్యాన్  సుంద‌ర్‌కు బంతి ఇచ్చాడు. అయితే కెప్టెన్ న‌మ్మ‌కాన్ని సుంద‌ర్ వ‌మ్ము చేయ‌లేదు.

ర‌చిన్ షాక్‌..
కివీస్ ఇన్నింగ్స్ 60వ ఓవ‌ర్ వేసిన వాషింగ్ట‌న్ తొలి బంతిని ర‌చిన్‌కు రౌండ్ ది వికెట్ నుంచి మిడిల్ స్టంప్ దిశ‌గా సంధించాడు. అయితే ఆ డెలివ‌రీని ర‌చిన్ ఫ్రంట్ ఫుట్ మీద డిఫెన్స్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. కానీ మిడిల్ స్టంప్ దిశ‌గా ప‌డిన బంతి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ట‌ర్న్ అవుతూ ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.

ఇది చూసిన ర‌చిన్ ఒక్క‌సారిగా షాక్ అయిపోయాడు. చేసేదేమి లేక  65 ప‌రుగుల‌తో ర‌చిన్ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. మ‌రోవైపు బ్లండెల్‌ను కూడా సుంద‌ర్ ఈ త‌ర‌హాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు.

62 ఓవ‌ర్‌లో ఆఖ‌రి బంతిని సుంద‌ర్ బ్లండెల్‌కు ఔట్ సైడ్ ఆఫ్ దిశగా సంధించాడు. కానీ బంతి మాత్రం ఒక్క సారిగా లోప‌ల‌కు ట‌ర్న్ అవుతూ స్టంప్స్‌ను తాకింది. దెబ్బ‌కు 3 ప‌రుగులు చేసిన బ్లండెల్ బిత్త‌ర పోయాడు.

 76 ఓవ‌ర్ల ముగిసే స‌రికి న్యూజిలాండ్ 8 వికెట్ల న‌ష్టానికి 242 ప‌రుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో సుంద‌ర్ ఫైవ్‌ వికెట్ల హాల్ సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు 22 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన సుంద‌ర్ 54 ప‌రుగులిచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. టెస్టు క్రికెట్‌లో సుంద‌ర్‌కు ఇదే తొలి ఫైవ్ వికెట్ల హాల్ కావ‌డం విశేషం.

చదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)