Breaking News

ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్‌ విజయం; ముంబైకి తొలి ఓటమి

Published on Sat, 03/18/2023 - 19:06

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తొలిసారి హై ఓల్టెజ్‌ మ్యాచ్‌ జరిగింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్‌ ఐదు వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్‌ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో ఎసెల్‌స్టోన్‌ సిక్సర్‌ కొట్టి జట్టును గెలిపించింది. అంతకముందు గ్రేస్‌ హారిస్‌ 38, తాహిలా మెక్‌గ్రాత్ 39 పరుగులు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో అమెలియా కెర్‌ రెండు వికెట్లు తీయగా.. నట్‌ సివర్‌, హేలీ మాథ్యూస్‌, ఇసీ వాంగ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్‌ అయింది. హేలీ మాథ్యూస్‌ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. ఇసీ వాంగ్‌ 32, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 32 పరుగులు చేశారు. యూపీ వారియర్జ్‌ బౌలింగ్‌లో సోఫీ ఎసెల్‌స్టోన్‌ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్‌ గైక్వాడ్‌, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ రెండు అద్బుత రనౌట్లతో మెరిసింది. 

ఈ విజయంతో యూపీ వారియర్జ్‌ తన ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కాగా సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇదే తొలి ఓటమి. ఇక యూపీ వారియర్జ్‌ విజయంతో ఆర్‌సీబీ వుమెన్‌ ప్లేఆఫ్‌ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. వరుస ఓటములతో పూర్‌ రన్‌రేట్‌ కలిగి ఉండడమే దీనికి కారణం.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)