Breaking News

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!

Published on Fri, 10/27/2023 - 18:57

వన్డే వరల్డ్‌కప్‌-2023 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. నవంబర్‌ 23న విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్‌ ఉంది.

టీమిండియా హెడ్‌ కోచ్‌గా లక్ష్మణ్‌..
మరోవైపు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారత జట్టు హెడ్‌ కోచ్‌గా దిగ్గజ ఆటగాడు, ఏన్సీఏ హెడ్‌ వీవీయస్‌ లక్ష్మణ్‌ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ఈ వరల్డ్‌కప్‌తో ముగియనుంది.

ఈ క్రమంలో అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ ధరఖాస్తులను అ‍హ్హనించనుంది. కొత్త కోచ్‌ వచ్చేటప్పటికి సమయం పట్టే అవకాశమున్నందన లక్ష్మణ్‌ తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

లక్ష్మణ్‌ ఇప్పటికే ద్రవిడ్‌ గైర్హజరీలో  ఐర్లాండ్‌, జింబాబ్వే టూర్‌లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. కాగా లక్ష్మణ్‌ ఇప్పటికే చాలా సిరీస్‌లలో భారత జట్టు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.  ఐర్లాండ్‌, జింబాబ్వే టూర్‌లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. 

గతంలో భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు కూడా లక్ష్మణ్‌ హెడ్‌కోచ్‌గా పనిచేశాడు.అతడి పర్యవేక్షణలోనే అండర్‌ 19 ప్రపంచకప్‌-2021ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది.
చదవండి: WC 2023: పాండ్యా లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి.. వీడియో షేర్‌ చేసిన బీసీసీఐ

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)