Breaking News

లేటు వయసులో వీరంగం సృష్టించిన ఇంగ్లండ్‌ మాజీ ప్లేయర్‌.. విధ్వంసకర శతకం

Published on Thu, 09/04/2025 - 07:51

ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ రవి బొపారా 40 ఏ‍ళ్ల లేటు వయసులో వీరంగం సృష్టించాడు. టీ20 బ్లాస్ట్‌ తొలి క్వార్టర్‌ ఫైనల్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో నార్తంప్టన్‌షైర్‌కు ఆడుతున్న బొపారా.. నిన్న (సెప్టెంబర్‌ 3) సర్రేతో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 105 పరుగులు చేశాడు.

వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో బొపారా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్తంప్టన్‌షైర్‌ భారీ స్కోర్‌ (154/4) చేసింది. ఓపెనర్లు ఇద్దరూ డకౌటైనా బొపారా (వన్‌డౌన్‌లో వచ్చి) మెరుపు సెంచరీతో ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరు హైలైట్‌గా నిలిచింది. అతడొక్కడే జట్టు స్కోర్‌లో 70 శాతానికి పైగా చేశాడు. టీ20ల్లో బొపారాకు ఇది మూడో శతకం.

మిగతా ఆటగాళ్లలో టిమ్‌ రాబిన్సన్‌ 20, జస్టిన్‌ బ్రాడ్‌ 9, సైఫ్‌ జైబ్‌ 18 (నాటౌట్‌) పరుగులు చేశారు. సర్రే బౌలర్లలో జోర్డన్‌ క్లార్క్‌ 3 వికెట్లతో రాణించగా.. క్రిస్‌ జోర్డన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

సామ్‌ కర్రన్‌ పోరాటం వృధా
భారీ లక్ష్య ఛేదనకు దిగిన సర్రే.. కెప్టెన​్‌ సామ్‌ కర్రన్‌ (38 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఓలీ పోప్‌ (23 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినప్పటికీ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జార్జ్‌ స్క్రిమ్షా 3, బెన్‌ సాండర్సన్‌ 2 వికెట్లు తీసి సర్రేను దెబ్బకొట్టారు.

 

 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)