Breaking News

ముంబై ఆటగాడు అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలి సారి!

Published on Sat, 05/27/2023 - 11:32

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు విష్ణు వినోద్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫియర్‌-2లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన విష్ణు వినోద్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముంబై వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ కంటికి గాయమైంది. దీంతో కిషన్‌ బ్యాటింగ్‌ రాలేదు. ఈ క్రమంలో  అతడి స్థానంలో విష్ణు వినోద్‌ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. కాగా ఈ సబ్‌స్టిట్యూట్‌షన్‌ రూల్‌ను ఐపీఎల్‌-2020 సీజన్‌లో ప్రవేశపెట్టారు. ఇక సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన  వినోద్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. గుజరాత్‌ చేతిలో 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసింది. తద్వారా ప్లేఆప్స్‌లోనే ముంబై కథముగిసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. శుబ్‌మన్‌ గిల్‌(129) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో 171 పరుగులకే ముంబై ఆలౌటైంది.

ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్‌(61), తిలక్‌ వర్మ(43) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. ఇక గుజరాత్‌ బౌలర్లలో మొహిత్‌ శర్మ 5 వికెట్లు పడగొట్టగా.. షమీ, రషీద్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు సాధించాడు. మే28న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌లో సీఎస్‌కే, గుజరాత్‌ తాడోపేడో తెల్చుకోనున్నాయి.
చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో సందడి చేసిన టీమిండియా యువ ఓపెనర్‌.. వీడియో వైరల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)