విధ్వంసం.. డబుల్ సెంచ‌రీతో చెల‌రేగిన సెహ్వాగ్ కొడుకు

Published on Thu, 11/21/2024 - 18:58

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకుంటున్నాడు. కూచ్ బెహార్ ట్రోఫీ-2024లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్..మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు.

తండ్రిలానే ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఆర్యవీర్ ఊచ‌కోత కోశాడు. త‌న‌దైన స్టైల్లో కేవ‌లం 229 బంతుల్లోనే త‌న డ‌బుల్ సెంచ‌రీ మార్క్‌ను జూనియ‌ర్ సెహ్వాగ్ అందుకున్నాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 34 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. 

ఆర్య‌వీర్ స‌రిగ్గా 200 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే స‌మయానికి ల్లీ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 468 ప‌రుగులు చేసింది. అత‌డితో పాటు ధ‌న్యా న‌క్ర‌(98) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. ఇక ఢిల్లీ ప్ర‌స్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 208 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

అరంగేట్రంలోనే అదుర్స్‌..
ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో ఆర్యవీర్ వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ త‌రపున ప్రొఫెషనల్ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. త‌న డెబ్యూ మ్యాచ్‌లోనే ఆర్య‌వీర్ అద‌రగొట్టాడు. మ‌ణిపూర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 49 ప‌రుగులు చేసిన త‌న జ‌ట్టుకు అద్భుత‌మైన విజ‌యాన్ని ఈ ఢిల్లీ చిచ్చ‌ర‌పిడుగు అందించాడు. ఆ తర్వాత ఆర్యవీర్ సెహ్వాగ్ తన ప్రతిభను చాటుకుంటూ వస్తున్నాడు. మ‌రోవైపు ఆర్యవీర్ ఐపీఎల్‌లో ఆడితే చూడాల‌న్న త‌న‌ కోరికను సెహ్వాగ్ ఇప్పటికే వెల్ల‌డించాడు.
చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. రోహిత్ శ‌ర్మ వ‌చ్చేస్తున్నాడు!
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)