'వారిద్ద‌రూ ఎంజాయ్ చేయ‌డానికి వ‌చ్చారు'.. స్టార్ క్రికెట‌ర్ల‌పై సెహ్వాగ్ ఫైర్‌

Published on Mon, 04/21/2025 - 16:56

ఐపీఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఆల్‌రౌండ‌ర్లు గ్లెన్ మాక్స్‌వెల్‌, లియామ్ లివింగ్‌స్టోన్ దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన ఏ మ్యాచ్‌లోనూ ఈ స్టార్ క్రికెట‌ర్లు త‌మ మార్క్‌ను చూపించ‌లేక‌పోయారు.

దీంతో వారిద్ద‌రిపై ఇరు జ‌ట్ల మెన్‌జెమెంట్‌లు వేటు వేశాయి.  ఇప్ప‌టికే మాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ గ‌త రెండు మ్యాచ్‌ల‌కు దూరం పెట్ట‌గా.. ఆర్సీబీ కూడా లివింగ్ స్టోన్‌ను  త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో బెంచ్‌కే ప‌రిమితం చేసింది. ఆదివారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో లివింగ్ స్టోన్‌కు ఆర్సీబీ తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. 

అత‌డి స్దానంలో క‌రేబియ‌న్ ఆల్‌రౌండ‌ర్  రొమారియో షెపర్డ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో మాక్స్‌వెల్‌, లివింగ్ స్టోన్‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాడు. వారి ఆట తీరును చూస్తుంటే ఏదో హాలిడేకి వ‌చ్చిన‌ట్లు ఉంద‌ని సెహ్వాగ్ మండిప‌డ్డాడు.

"మాక్స్‌వెల్‌, లివింగ్ స్టోన్‌లో తమ జట్ల కోసం పోరాడాలనే క‌సి క‌నిపించ‌డం లేదు. వారు ఏదో హాలిడే కోసం భార‌త్‌కు వ‌చ్చిన‌ట్లు అన్పిస్తోంది. ఇక్క‌డ‌కు వ‌చ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్లిపోవ‌డ‌మే వాళ్లు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అంతే తాము ప్రాతినిథ్యం వ‌హిస్తున్న జ‌ట్టు కోసం ఏదైనా చేయాల‌నే త‌ప‌న వారిలో లేదు. 

గ‌తంలో చాలా మంది విదేశీ క్రికెట‌ర్ల‌తో క‌లిసి ఆడాను. వారిలో ఒక‌రిద్ద‌రూ మాత్ర‌మే జట్టు కోసం ఏదైనా చేయ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు అప్పటిలో నాకు అన్పించింద‌ని" క్రిక్‌బ‌జ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా మాక్స్‌వెల్ ఇప్ప‌టివ‌ర‌కు 6 మ్యాచ్‌లు ఆడి కేవ‌లం 41 ప‌రుగుల‌తో పాటు నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌రోవైపు లివింగ్‌స్టోన్ 7 మ్యాచ్‌లు ఆడి 87 ప‌రుగులు చేశాడు.
చ‌ద‌వండి: PBKS vs RCB: నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్‌ కోహ్లి

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)