Breaking News

DPL 2024: వీరేంద్ర సెహ్వాగ్‌కు కీల‌క బాధ్య‌త‌లు...

Published on Sat, 08/03/2024 - 15:56

ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌ అరంగేట్ర సీజ‌న్‌కు ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ర‌కాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ తొట్ట‌తొలి ఎడిష‌న్ ఆగ‌స్టు 17 నుంచి సెప్టెంబ‌ర్ 8 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. 

ఈ  లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈ లీగ్‌లో ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట‌ర్ల‌తో భార‌త స్టార్ క్రికెట‌ర్లు రిష‌బ్ పంత్‌, ఇషాంత్ శర్మ‌, న‌వ‌దీప్ సైనీ భాగం కానున్నారు.

డీపీఎల్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సెహ్వాగ్..
ఇక ఇది ఇలా ఉండ‌గా.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్  ప్రారంభ సీజన్ బ్రాండ్ అంబాసిడర్‌గా  భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను డీడీసీఎ నియ‌మించింది. శుక్ర‌వారం ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో డీడీసీఎ త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. ఈ కార్య‌క్రామానికి సెహ్వాగ్ సైతం హాజ‌రయ్యాడు. 

కాగా ఢిల్లీ నుంచే భార‌త జ‌ట్టుకు సెహ్వాగ్ ప్రాతినిథ్యం వ‌హించాడు. ఇక ఢిల్లీలోని అత్యుత్తమ ప్రతిభావంతులైన యువ క్రికెట‌ర్ల‌ను  ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని డీడీసీఏ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ను డీడీసీఎ ప్రారంభించ‌నుంది. 

లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో ఆరు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురాణి డిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జ‌ట్లు మొత్తం రూ. 49.65 కోట్ల రూపాయలకు విక్రయించబడ్డాయి.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)