Breaking News

లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా!

Published on Sun, 05/14/2023 - 13:57

ఐపీఎల్‌-2023లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయంతో పంజాబ్‌ తమ  ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ కింగ్స్‌.. ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

ఇక ఈ పంజాబ్‌ విజమంలో ఆ జట్టు ఓపెనర్‌  ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. శిఖర్‌ ధావన్‌, లైమ్‌ లివింగ్‌ స్టోన్‌ వంటి ఆటగాళ్లు విఫలమైన చోట.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.  ప్రభ్‌సిమ్రాన్ కేవలం 65 బంతుల్లోనే 10ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు.

పంజాబ్‌ 161  గౌరవప్రదమైన స్కోరు చేయడంలో ప్రభ్‌సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇక మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన  ప్రభ్‌సిమ్రాన్‌పై భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా పంజాబ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రాన్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవతున్నాడని సెహ్వాగ్ విమర్శించాడు.

                             

కాగా ఐపీఎల్‌లో వేలంలో శామ్ కర్రాన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.18. 5 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన శామ్ కర్రాన్‌ 216 పరుగులతో పాటు కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ.. "ప్రభ్‌సిమ్రన్‌ జట్టులోకి వచ్చినప్పటి నుంచి పంజాబ్‌ కింగ్స్‌ అద్భుతంగా రాణిస్తోంది. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. పంజాబ్‌కు చాలా బెనిఫిట్‌ కలుగుతుంది.

ప్రభ్‌సిమ్రన్‌ తన అరంగేట్ర సీజన్‌లో భారీ మొత్తం (రూ. 4.8 కోట్లు) దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు అతడు కేవలం రూ. 60 లక్షలకు మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్‌ తన టాలెంట్‌ ఎంటో చూపించాడు. అతడికి సెంచరీలు కొట్టగలిగే సత్తా ఉంది అని నిరూపించాడు.

ఇటువంటి యువ ఆటగాడు అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపిస్తుంటే అంతకు మించి ఏమి కావాలి. సామ్‌ కర్రాన్‌ను 18.5 కోట్లు పెట్టి పంజాబ్‌ కొనుగొలు చేసింది. ఏం లాభం. ఒక్క మ్యాచ్‌లో కూడా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)