Breaking News

ఈసారి ఐపీఎల్ టైటిల్ ఆ జ‌ట్టుదే: వీరేంద్ర సెహ్వాగ్

Published on Tue, 06/03/2025 - 09:48

ఐపీఎల్‌-2025 సీజ‌న్ తుది అంకానికి చేరుకుంది. రెండు నెల‌ల పాటు అభిమానులను అల‌రించిన ఈ మెగా టోర్నీ.. మంగ‌ళ‌వారంతో ముగియ‌నుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ పోరులో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరంభం నుంచి బరిలో నిలిచినా ఒక్కసారి కూడా ఈ రెండు జ‌ట్లు టైటిల్‌ను ముద్దాడాలేక‌పోయాయి. దీంతో ఇరు జ‌ట్లు కూడా త‌మ 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. ఇరు జ‌ట్లు స‌మ‌వుజ్జీల‌గా ఉండ‌డంతో ఫైన‌ల్ పోరు ఉత్కంఠ భ‌రితంగా సాగ‌డం ఖాయం. ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ అంచ‌నా వేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ సొంతం చేసుకుంటుంద‌ని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.

"ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆర్సీబీ విజ‌యం సాధిస్తుంద‌ని నేను అనుకుంటున్నాను.  అయితే సాధ‌ర‌ణంగా గ‌త కొన్ని మ్యాచ్‌ల‌గా నేను స‌పోర్ట్ చేసే జ‌ట్టు ఓడిపోతోంది. క్వాలిఫ‌య‌ర్‌-1లో ఆర్సీబీపై పంజాబ్ విజ‌యం సాధిస్తుంద‌ని అంచ‌నా వేశాను. కానీ ఆ మ్యాచ్‌లో పంజాబ్ చిత్తు అయింది.

అదేవిధంగా ఎలిమినేట‌ర్‌లో ముంబైపై గుజ‌రాత్ గెలుస్తుంద‌ని చెప్పా. కానీ గుజ‌రాత్ కూడా ఓడిపోయింది. ఆ త‌ర్వాత క్వాలిఫ‌య‌ర్‌-2లో ముంబై ఇండియ‌న్స్‌కు స‌పోర్ట్ చేశా. అక్క‌డ కూడా ముంబై ప‌రాజ‌యం పాలైంది. టీమిండియా విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతోంది. నేను గెలుస్తుంద‌ని చెప్పినా ప్ర‌తీసారి భార‌త్ ఓడిపోయింద‌ని" క్రిక్‌బ‌జ్ లైవ్‌షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.

తుది జట్ల వివరాలు (అంచనా)  
బెంగళూరు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్‌), కోహ్లి, సాల్ట్, మయాంక్‌ అగర్వాల్, లివింగ్‌స్టోన్, జితేశ్‌ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్‌ పాండ్యా, యశ్‌ దయాళ్, హాజల్‌వుడ్‌.

పంజాబ్‌: శ్రేయస్‌ అయ్యర్‌ (కెపె్టన్‌), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్‌సిమ్రన్, ఇన్‌గ్లిస్, నేహల్‌ వధేరా, స్టొయినిస్, శశాంక్‌ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్‌దీప్‌ సింగ్‌.
 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)