Breaking News

బాబు అక్కడ ఉన్నది కింగ్‌.. కోహ్లీతోనే ఆటలా! ఇచ్చిపడేశాడుగా

Published on Thu, 01/04/2024 - 08:48

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లి ఫీల్డ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన హావభావాలతో ప్రత్యర్ధి ఆటగాళ్లను విరాట్‌ స్లెడ్జింగ్‌ చేయడం మనం చాలా సందర్బాల్లో చూశాం. అటువంటి కింగ్‌ ముందు దక్షిణాఫ్రికా యువ పేసర్‌ నండ్రీ బర్గర్‌ కుప్పిగంతులు వేశాడు. కోహ్లిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి తనదైన స్టైల్‌లో బర్గర్ కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు.

ఏమి జరిగిందంటే?
14.2 ఓవర్‌లో కెప్టెన్‌  రోహిత్ శర్మను బర్గర్‌ ఔట్‌ చేశాడు. రోహిత్‌  తర్వాత విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కు దిగాడు. అదే ఓవర్‌లో విరాట్‌ ఎదుర్కొన్న తొలి బంతినే బర్గర్‌  గుడ్‌ లెంగ్త్‌ డెలివరీ సంధించాడు. కోహ్లి కూడా బంతి అద్బుతంగా ఆడి డిఫెండ్‌ చేశాడు. ఆ బంతిని నాన్‌స్టైక్‌లో ఎండ్‌లో బర్గర్‌ అందుకున్నాడు. అయితే కోహ్లి క్రీజులో ఉన్నప్పటికీ బర్గర్‌​ అత్యుత్సహం ప్రదర్శించాడు.

అతడు బంతిని కోహ్లిపై విసురుతా అన్నట్లు రియాక్షన్‌ ఇచ్చాడు. కోహ్లి మాత్రం నవ్వుతూ క్రీజులో నిలబడిపోయాడు. ఆ తర్వాత కోహ్లి తనదైన శైలిలో బర్గర్‌కు సమాధానం చెప్పాడు. అదే ఓవర్‌లో వరుసగా బౌండరీలు బాది అతడిని ఒత్తిడిలోకి నెట్టాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. బాబు అక్కడ ఉన్నది కింగ్‌.. కోహ్లీతోనే ఆటలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 46 పరుగులు చేశాడు.
చదవండి: IND vs SA: ఒకే రోజు 23 వికెట్లు.. సచిన్ టెండూల్కర్ రియాక్షన్‌ ఇదే

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు