Breaking News

స్మృతి మంధానకు వీడియో కాల్‌ చేసిన కోహ్లి.. వీడియో వైరల్‌

Published on Mon, 03/18/2024 - 08:29

'ఈ సాల్‌ కప్‌ నమదే'.. ప్రతీ ఏడాది  ఐపీఎల్‌ సీజన్‌కు ముందు ఆర్సీబీ అభిమానుల నుంచే వినిపించే మాట. కానీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఆఖరికి ఊరించి ఊసురుమన్పించడం ఆర్సీబీకి పరిపాటిగా మారిపోయింది. తమ ఆరాద్య జట్టు ఒక్కసారి ట్రోఫీని ముద్దాడితే చూడాలని పరితపించారు.

అయితే ఎట్టకేలకు అభిమానుల కల నేరవేరింది. 16 ఏళ్లుగా ఐపీఎల్‌లో పురుషుల ఫ్రాంఛైజీకి సాధ్యం కాని టైటిల్‌ను డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌లోనే అమ్మాయిల జట్టు సాధించింది. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఆర్సీబీ పురుషుల జట్టు ఆటగాళ్లు సైతం సంబరాల్లో మునిగితేలిపోయారు. తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆర్సీబీ మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియా వేదికగా తమ మహిళల జట్టును అభినందించాడు.

సూపర్‌ ఉమెన్‌ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అదేవిధంగా  టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన వీడియో కాల్‌ కూడా చేశాడు. మంధానతో పాటు మిగితా ప్లేయర్స్‌తో విరాట్‌ కాసేపు సంభాషించాడు. విరాట్‌ను చూడగానే ఆర్సీబీ ప్లేయర్లు ఆనందంతో గంతులేశారు.  ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 2008 తొలి సీజన్‌ నుంచి ఆర్సీబీకి విరాట్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
చదవండి: WPL 2024: డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్‌ మనీ ఎన్ని కోట్లో తెలుసా?

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)