Breaking News

'త‌ప్పేమి కాదు.. అత‌డు త‌న రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకోవాలి'

Published on Wed, 07/16/2025 - 18:53

అండర్సన్-సచిన్ టెండూల్క‌ర్‌ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో టెస్టులో 22 ప‌రుగుల తేడాతో భార‌త్‌ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. నువ్వా నేనా అన్న‌ట్లు సాగిన మ్యాచ్‌లో టీమిండియా పోరాడిన‌ప్ప‌టికి విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2 తేడాతో గిల్ సేన వెన‌క‌బ‌డింది. ఈ నేప‌థ్యంలో టీమిండియా మాజీ ప్లేయ‌ర్‌ మ‌ద‌న్‌లాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త స్టార్ బ్యాట‌ర్‌ విరాట్ కోహ్లిని త‌న టెస్టు రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని మ‌ద‌న్‌లాల్ కోరాడు. కోహ్లి అవ‌స‌రం జట్టుకు ఉంద‌ని, త‌న అనుభవాన్ని యువ ఆట‌గాళ్ల‌తో పంచుకోవాల‌ని అత‌డు అభిప్రాయ‌ప‌డ్డాడు.

విరాట్ కోహ్లికి భార‌త క్రికెట్‌పై మక్కువ ఎక్కువ‌. అత‌డు త‌న రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకుని, టెస్టుల్లో తిరిగి ఆడాల‌ని నేను కోరుకుంటున్నాను. విరాట్ తన నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌డంలో త‌ప్పులేదు. ఈ సిరీస్‌లో కాకపోయినా, తదుపరి సిరీస్‌లో అతడు త‌దుప‌రి టెస్టు సిరీస్‌లోనైనా ఆడాలి.

అత‌డు ఇంకా ఇప్ప‌టికి చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఒకటి రెండేళ్లు ఈజీగా ఆడ‌గ‌ల‌డు. త‌న అనుభ‌వంతో యువ ఆట‌గాళ్ల‌ను రాటుదేల్చాలి. అత‌డు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి ఎక్కువ రోజులు కాలేదు, కాబ‌ట్టి త‌న నిర్ణ‌యాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది" అని క్రికెట్ ప్రీడిక్టాలో మ‌ద‌న్‌లాల్‌ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు విరాట్ కోహ్లి టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికి అంద‌రికి షాకిచ్చాడు. అత‌డికంటే ముందు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రెడ్‌బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. విరాట్‌ కోహ్లి తన టెస్టు కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్‌  సెంచరీలు ఉన్నాయి.
చదవండి: జితేశ్‌ శర్మకు అవమానం.. దినేశ్‌ కార్తిక్‌ కూడా పట్టించుకోలేదా?
 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు