Breaking News

కోహ్లికి ఏమైంది.. రోహిత్‌, ద్రవిడ్‌తో విభేదాలా? కారణం అదేనా

Published on Mon, 06/12/2023 - 11:17

లండన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి వరుసగా సోషల్‌ మీడియాలో క్రిప్టిక్ స్టోరీలను పోస్టు చేస్తున్నాడు. 

తాజగా ఈ ఓటమి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో మరో క్రిప్టిక్‌ స్టోరీని కోహ్లి పోస్టు చేశాడు. "మౌనమే మన బలానికి గొప్ప మూలం"  అర్ధం వచ్చే పోస్టును విరాట్‌ షేర్‌ చేశాడు. అంతకు ముందు కూడా విరాట్‌ కోహ్లి ఈ తరహా మరో పోస్టు చేశాడు. "మనకు బాధలు, భయాలు, అనుమానాలు మరీ ఎక్కువైతే బ్రతకడానికి, ప్రేమించడానికి సమయం ఉండదు. కాబట్టి కొన్ని సార్లు అన్నీ వదిలేయడానికి కూడా ప్రాక్టీస్‌ చేయాలి " అంటూ ఇన్‌స్టాలో క్రిప్టిక్‌ స్టోరీని షేర్‌ చేశాడు.

అయితే విరాట్‌ ఇటువంటి పోస్టులు ఎందుకు చేస్తున్నాడో తెలియక అతడి అభిమానులు బుర్రలు చించుకుంటున్నారు. మరి కొంతమంది అయితే మరో అడుగు ముందుకు వేసి కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో కోహ్లికి విభేదాలు ఏర్పడ్డాయి అని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టు ఎంపిక విషయంలో కోహ్లి సూచనలను రోహిత్‌, ద్రవిడ్‌ పరిగణలోకి తీసుకోలేదని, అందుకే అతడు జట్టు మేనేజ్‌మెంట్‌పై ఆసంతృప్తిగా ఉన్నాడని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
చదవండి: WTC Final: టీమిండియా చేసిన తప్పు అదే.. ఇలా అయితే చాలా కష్టం: సెహ్వాగ్

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు