Breaking News

వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2023 అవార్డు రేసులో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు

Published on Thu, 01/04/2024 - 17:03

ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 నామినీస్‌ జాబితాను ఇవాళ (జనవరి 4) ప్రకటించింది. అవార్డు రేసులో ఏకంగా ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉండటం విశేషం. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చిన విరాట్‌ కోహ్లి, మొహమ్మద్‌ షమీతో పాటు గతేడంతా  వన్డేల్లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్‌ గిల్‌ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కోసం పోటీపడనున్నారు. వీరితో పాటు న్యూజిలాండ్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌ రేసులో నిలిచాడు. మిచెల్‌ సైతం గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించడంతో పాటు వరల్డ్‌కప్‌ 2023లోనూ చెలరేగిపోయాడు. 

కాగా, ఐసీసీ నిన్న మెన్స్‌ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (2023), మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (2023) అవార్డుల కోసం నామినీస్‌ జాబితాను ప్రకటించింది. టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు రేసులో టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, న్యూజిలాండ్‌ ఆటగాడు మార్క్‌ చాప్‌మన్‌, ఉగాండ ఆటగాడు అల్పేశ్‌ రామ్‌జనీ ఉండగా.. ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రేసులో టీమిండియా అప్‌కమింగ్‌ స్టార్‌ యశస్వి జైస్వాల్‌తో పాటు న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ, శ్రీలంక పేసర్‌ దిల్షన్‌ మధుషంక నిలిచారు. గతేడాది ఆయా విభాగాల్లో ప్రదర్శన ఆధారంగా ఐసీసీ నామినీస్‌ జాబితాను ఎంపిక చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)