ఈ రోజు వస్తుందని అనుకోలేదు.. ప్రశాంతంగా నిద్రపోతా: విరాట్‌ కోహ్లి

Published on Wed, 06/04/2025 - 09:39

విరాట్ కోహ్లి.. త‌న 18 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘ‌న‌త‌లు సాధించాడు. వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీలు వంటి ఐసీసీ టైటిల్స్‌ను సైతం విరాట్ సొంతం చేసుకున్నాడు. కానీ కింగ్‌ కెరీర్‌లో ఐపీఎల్ ట్రోఫీ ఒక్కటే వెలితిగా ఉండేది. ఇప్పుడు ఎట్టకేలకు కోహ్లి  ఖాతాలో ఐపీఎల్ టైటిల్ కూడా చేరింది.

కోహ్లి 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ప్రతీ సీజన్‌లో బ్యాటర్​గా, ఫీల్డర్​గా, కెప్టెన్​గా ఆర్సీబీని భుజాల మీద మోసిన కోహ్లి.. తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. ఐపీఎల్‌-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. దీంతో ఏన్నో ఏళ్ల నుంచి అంద‌ని ద్రాక్షగా ఊరించిన క‌ల‌ల‌ క‌ప్పు కింగ్ సొంత‌మైంది.

ఫైన‌ల్లో ఆర్సీబీ విజయం ఖరారైన వెంటనే మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ త‌ర్వాత ట్రోఫీని అందుకుని మైదానం చుట్టూ తిరిగుతూ సంద‌డి చేశాడు. ఈ క్ర‌మంలో మ్యాచ్ అనంత‌రం మాట్లాడిన కోహ్లి తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. ఈ రోజు వస్తుందని అస్సలు అనుకోలేదని కోహ్లి తెలిపాడు.

పసి పాపలా ప్రశాంతంగా నిద్రపోతా
"18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఈ విజయం జట్టు సభ్యులది మాత్రమే కాదు అభిమానులది కూడా. నేను యువకుడిగా, ఆ తర్వాత కెరీర్‌ అత్యుత్తమ దశలో, ఇప్పుడు అనుభవజ్ఞుడిలా ఈ టీమ్‌తో ఉన్నాను. ప్రతీ సీజన్‌లోనూ ఇదే తరహాలో విజయం కోసం తీవ్రంగా శ్రమించాను. 

నేను చేయగలిగిందంతా చేశాను. చివరకు ఇప్పుడు దక్కిన భావన గొప్పగా ఉంది. ఈ రోజు వస్తుందని అనుకోలేదు. ఆఖరి బంతి తర్వాత భావోద్వేగాలను నియంత్రించుకున్నాను. ఏం జరిగినా ఇదే జట్టుతో ఉన్నాను. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా నాతో నిలబడింది. ఇదే జట్టుతో టైటిల్‌ గెలవాలని కలగన్నాను. మరో టీమ్‌తో గెలిచి ఉంటే ఇంత ఆనందం దక్కకపోయేదేమో. నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే ఉన్నాయి.

గతంలో చెప్పినట్లుగా నేను ఐపీఎల్‌ ఆడినంత వరకు ఇదే జట్టుతో ఉంటా. ఎంతో పోటీ, తీవ్రత ఉండే ఈ టోర్నీలో టైటిల్‌ విజయాన్ని ఎంతో ప్రాధాన్యత ఉంది. నేను ఇలాంటి పెద్ద టోరీ్నలను గెలవాలని, చిరస్మరణీయ క్షణాలను కోరుకుంటా.  కెరీర్‌లో అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. ఈ రోజు నేను ప్రశాంతంగా పసిపాపలా నిద్రపోతా. వేలంలో మా ఎంపికను చాలా మంది ప్రశ్నించారు. కానీ వాటిని తప్పని నిరూపించామని కోహ్లి పేర్కొన్నాడు.
చదవండి: Virat Kohli Emotional Video: 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌.. వెక్కి వెక్కి ఏడ్చిన కోహ్లి! వీడియో వైర‌ల్‌

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)