Breaking News

IND vs SA: టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా

Published on Wed, 12/03/2025 - 22:11

రాయ్‌పూర్ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన రెండో వ‌న్డేలో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 1-1తో ద‌క్షిణాఫ్రికా స‌మం చేసింది. 359 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో చేధించింది.

ప్రోటీస్‌ ఓపెనర్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110) సూపర్‌ సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రీట్జ్కే(64 బంతుల్లో 68), బ్రెవిస్‌(34 బంతుల్లో 54) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖరిలో కార్బిన్‌ బాష్‌(14 బంతుల్లో 25) మరోసారి కీలక నాక్‌ ఆడాడు.

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఒక్క అర్ష్‌దీప్‌ మినహా మిగితా బౌలర్లందరూ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. అంతకు తోడు చెత్త ఫీల్డింగ్‌ కూడా భారత్‌ కొంపముంచింది. మిస్‌ ఫీల్డ్‌ల రూపంలో టీమిండియా దాదాపు 30 పరుగులు సమర్పించుకుంది. అర్ష్‌దీప్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలా రెండు వికెట్లు సాధించారు.

కోహ్లి, రుతు సెంచ‌రీలు వృథా..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి((93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్‌ గైక్వాడ్‌(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. రాహుల్‌(66) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు. అయితే భారత్‌ ఓటమి పాలవ్వడంతో కోహ్లి, రుతురాజ్‌ సెంచరీలు వృథా అయిపోయాయి. ఇ​క సిరీస్‌ డిసైడర్‌ మూడో వన్డే శనివారం వైజాగ్‌ వేదికగా జరగనుంది.

 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)