Breaking News

ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి.. కోహ్లి క్రిప్టిక్ పోస్ట్! మౌనమే అంటూ

Published on Mon, 06/12/2023 - 07:53

ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుని 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఇంగ్లండ్‌ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియాకు మరోసారి నిరాశే ఎదురైంది. లండన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇక 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది.

రెండో ఇన్నింగ్స్‌లో ఏ ఒక్క భారత బ్యాటర్‌ కూడా అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయారు. విరాట్ కోహ్లి (49), అజింక్య రహానే (46) విజయంపై ఆశలు రేపినా.. ఎక్కువ సేపు నిలువలేకపోయారు. ఇక ఈ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్రిప్టిక్‌ స్టోరీని పోస్టు చేశాడు. "మౌనమే మన బలానికి గొప్ప మూలం"  అంటూ అర్ధం వచ్చే పోస్టును విరాట్‌ షేర్‌ చేశాడు.

కాగా ఐదో రోజు ఆటకు ముందు కూడా విరాట్‌ కోహ్లి ఈ తరహా మరో పోస్టు చేశాడు. "మనకు బాధలు, భయాలు, అనుమానాలు మరీ ఎక్కువైతే బ్రతకడానికి, ప్రేమించడానికి సమయం ఉండదు. కాబట్టి కొన్ని సార్లు అన్నీ వదిలేయడానికి కూడా ప్రాక్టీస్‌ చేయాలి" అంటూ ఇన్‌స్టాలో క్రిప్టిక్‌ స్టోరీని షేర్‌ చేశాడు.

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)