Breaking News

కోహ్లి ఫామ్‌లో​కి వస్తే భారత్‌కు తిరుగులేదు..

Published on Mon, 02/10/2025 - 21:40

ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్ట్ నుండి పేలవమైన ఫామ్ కారణంగా   వైదొలిగిన  భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత జరిగిన రంజీ ట్రోఫీ టోర్నమెంట్ లో కూడా ఆశించిన విధంగా రాణించలేక పోయాడు. ఈ నేపధ్యం లో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముందు రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడం చాల ముఖ్యమైన విషయం.

వరుసగా పది ఇన్నింగ్స్‌ల లో ( తొమ్మిది టెస్టులు, ఒక వన్డే)  విఫలమైన రోహిత్ చివరికి ఆదివారం కటక్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించి సిక్సర్ల మోత మోగించాడు. రోహిత్ కటక్‌ ప్రేక్షకులను నిజంగా అలరించాడు, 12 ఫోర్లు మరియు 7 సిక్సర్లు తో వన్డేల్లో తన 32వ సెంచరీ సాధించి, భారత్ ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ చేజిక్కించుకునేందుకు  తన వంతు పాత్ర పోషించాడు. జట్టు రధ సారధి లాగా ముందుండి నడిపించాడు.

ఈ సెంచరీతో, రోహిత్ 30 ఏళ్లు నిండిన క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా రికార్డ్ నమోదు చేసాడు. లిటిల్ మాస్టర్  సచిన్ టెండూల్కర్ గతంలో 35 సెంచరీలు తో చేసిన రికార్డును రోహిత్ అధిగమించాడు. భారత్ తరపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన వారి లో రోహిత్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా 15,404 పరుగులు సాధించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 15,335 పరుగులతో సాధించిన మరో  రికార్డును కూడా రోహిత్ ఈ మ్యాచ్ తో అధిగమించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో   ఈ జాబితా లో అగ్ర స్థానం లో ఉన్నాడు. 

"చాలా సంవత్సరాలుగా నేను క్రికెట్ ఆడుతున్నాను. నేను ఏమి చేయాలో నాకు తెల్సు. నా నుండి ఏమి అవసరమో నాకు అర్థమైంది. పిచ్ లోకి వెళ్లి నేను చేసింది అదే" అని రోహిత్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడంతో భారత్ జట్టు మానేజిమెంట్ కి పెద్ద తలనొప్పి తగ్గింది. ఇక మూడో వన్డేలో స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ కూడా సెంచరి సాధించినట్టయితే  ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు భారత్ బ్యాటింగ్ గాడి లో పడినట్టే.  

బ్యాటింగ్ స్థానం లో మార్పులు
అయితే భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు పై పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు మేనేజిమెంట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కంటే ముందుగా పంపడం పై పెద్ద దుమారమే చెలరేగుతోంది.  టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన రాహుల్ జట్టు అవసరాల అనుగుణంగా బ్యాటింగ్ స్థానాన్ని మార్చడం పై జట్టు మేనేజిమెంట్ పలు విమర్శలు ఎదుర్కొంటోంది.

"అక్షర్ పటేల్ మళ్ళీ కెఎల్ రాహుల్ కంటే ముందుగా బ్యాటింగ్ రావడమేమిటి? నాకు మాటలు కూడా రావడం లేదు. రాహుల్ లాంటి నైపుణ్యమైన బాట్స్మన్ ని ఆరో స్థానానికి నెట్టడం చాల దారుణం. అక్షర్‌ను రాహుల్ కన్నా ముందుగా బ్యాటింగ్ పంపడం. అదీ ఇలాంటి పిచ్ పై సరైన నిర్ణయం కాదు, అని భారత్ మాజీ ఆటగాడు దొడ్డ గణేష్ వ్యాఖ్యానించాడు.
 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)