Breaking News

ఆసీస్ గ‌డ్డ‌పై వేట‌కు సిద్ద‌మ‌వుతున్న కింగ్ కోహ్లి..

Published on Wed, 08/13/2025 - 17:17

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. ఐపీఎల్-2025 సీజ‌న్ త‌ర్వాత విశ్రాంతి తీసుకుంటున్న కింగ్ కోహ్లి.. ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగే వ‌న్డే సిరీస్‌లో భార‌త  జ‌ట్టు త‌ర‌పున ఆడ‌నున్నాడు. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉంటున్న కోహ్లి ఆసీస్‌తో సిరీస్ కోసం త‌న ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టాడు.

ట్రైనింగ్ సెష‌న్‌లో గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ నయీమ్ అమీన్‌తో కోహ్లి క‌లిసి ఉన్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. దీంతో అభిమానులు కింగ్ తిరిగొస్తున్నాడ‌ని తెగ సంబ‌ర‌ప‌డుతున్నారు. కాగా టెస్టుల‌కు,టీ20ల‌కు వీడ్కోలు ప‌లికిన కోహ్లి ప్ర‌స్తుతం వ‌న్డేల్లో మాత్ర‌మే కొన‌సాగుతున్నాడు.

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌-2024 విజ‌యం త‌ర్వాత అంత‌ర్జాతీయ టీ20లు వీడ్కోలు ప‌లికిన కోహ్లి.. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు టెస్టుల నుంచి త‌ప్పుకొన్నాడు. కోహ్లి చివ‌ర‌గా భార‌త త‌ర‌పున ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. ఈ మెగా టోర్నీ టైటిల్‌ను భార‌త్ సొంతం చేసుకోవ‌డంలో కోహ్లి కీల‌క పాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్‌ల‌లో మొత్తంగా విరాట్ 218 ప‌రుగులు చేశాడు.

వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కోహ్లి ఆడుతుతా?
అయితే ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027లో కోహ్లి ఆడేది అనుమాన‌మే. అప్ప‌టికి అత‌డి వ‌య‌స్సు 38 ఏళ్ల దాటుతుండ‌డంతో ఈ మెగా టోర్నీకి ఓ యువ ఆట‌గాడిని సిద్దం చేసే యోచ‌న‌లో సెల‌క్ట‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న త‌ర్వాత కోహ్లి, రోహిత్‌ల వ‌న్డే భ‌విష్య‌త్తుపై ఓ క్లారిటి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టి నుంచి ప్ర‌పంచ‌క‌ప్-2027 ముందు వ‌ర‌కు భార‌త జ‌ట్టు 27 వ‌న్డేలు ఆడ‌నుంది. వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం జ‌ట్టు సెల‌క్ష‌న్ రేసులో ఉండాలంటే ఈ సీనియ‌ర్ ద్వ‌యం ఫిట్‌నెస్, ఫామ్‌ను కాపాడుకోవాలి.

అయితే దేశ‌వాళీ టోర్నీ విజ‌య్ హాజారే ట్రోఫీలో కూడా రోకో ఆడ‌నున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాలో భార‌త జ‌ట్టు ప‌ర్య‌ట‌న ఆక్టోబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆతిథ్య జ‌ట్టుతో టీమిండియా మూడు వ‌న్డేలు, ఐదు టీ20లు ఆడ‌నుంది.
చదవండి: ఐపీఎల్‌-2025లో అట్ట‌ర్ ప్లాప్‌.. క‌ట్ చేస్తే! టీమిండియా లెజెండ్‌పై వేటు?
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)