Breaking News

'ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వ‌కు.. నీ అవ‌స‌రం టీమిండియాకు ఉంది'

Published on Sat, 05/10/2025 - 19:18

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌కటించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. టెస్టు క్రికెట్ నుంచి రిటైరవ్వాలని అనుకుంటున్నట్లు బీసీసీఐకి కోహ్లి లేఖ రాసాడ‌న్న వార్త కలకలం రేపుతోంది. అయితే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు వ‌ర‌కు కొన‌సాగాల‌ని కోహ్లిని బీసీసీఐ కోరిన‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే రెడ్ బాల్ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప‌క‌టించాడు. ఇప్పుడు కోహ్లి కూడా టెస్టుల నుంచి త‌ప్పుకుంటే అది టీమిండియాకు గ‌ట్టి ఎదురు దెబ్బే అవుతోంది. ఈ నేప‌థ్యంలో కోహ్లికి భార‌త మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు కీల‌క సూచ‌న‌లు చేశాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని విరాట్‌ను రాయుడు కోరాడు.

"విరాట్ కోహ్లి.. ద‌య‌చేసి రిటైర్ అవ్వొద్దు. భారత జట్టుకు మీ అవసరం ఇప్పుడు చాలా ఉంది. ప్ర‌స్తుతం మీలో ఆడే సత్తా ఇంకా ఉంది. ఇప్ప‌టికీ చాలా ఫిట్‌గా క‌న్పిస్తున్నారు. మీరు టీమిండియా త‌రుపున పోరాడేందుకు బ‌రిలోకి దిగ‌క‌పోతే టెస్టు క్రికెట్ స్వ‌రూప‌మే మారిపోతుంది.  ద‌య‌చేసి మీ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోండి" అని రాయుడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు. 

అయితే టెస్టుల్లో ఇంగ్లండ్ గ‌డ్డ‌పై మాత్రం కోహ్లికి మంచి రికార్డులేదు. ఇంగ్లండ్‌లో 17 టెస్టులు ఆడిన విరాట్‌.. 33.21 స‌గ‌టుతో 1096 ప‌రుగులు చేశాడు. ఓవ‌రాల్‌గా కోహ్లి త‌న టెస్టు కెరీర్‌లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు, ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. కానీ గత 4 సంవత్సరాల నుంచి అతని సగటు 50 కంటే తక్కువగా ఉంది. కాగా ఇంగ్లండ్ టూర్‌కు మే 23న భార‌త జ‌ట్టుతో పాటు కొత్త టెస్టు జ‌ట్టు కెప్టెన్‌ను కూడా బీసీసీఐ ప్ర‌క‌టించ‌నుంది.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)