Breaking News

IND Vs NZ: కివీస్ బౌల‌ర్ మాస్ట‌ర్ మైండ్‌.. బెంబేలెత్తిన విరాట్‌ కోహ్లి(వీడియో)

Published on Thu, 10/17/2024 - 11:56

బెంగ‌ళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లి తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన కోహ్లి ప‌రుగులేమి చేయ‌కుండా పెవిలియ‌న్‌కు చేరాడు. తొలి బంతి నుంచే కివీస్ పేస‌ర్ల‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది ప‌డిన విరాట్‌.. 9 బంతులు ఆడి ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు.

న్యూజిలాండ్ యువ పేస‌ర్ ఓ'రూర్క్ అద్బుత‌మైన బంతితో కోహ్లిని బోల్తా క‌ట్టించాడు. భార‌త ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్ వేసిన రూర్క్‌.. ఆఖ‌రి బంతిని కోహ్లి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశ‌గా సంధించాడు. అయితే బంతి ఒక్క‌సారిగా ట‌ర్న్ అయ్యి లోప‌ల‌కు వ‌చ్చింది. దీంతో బంతి త‌న ప్యాడ్‌ల‌కు తాక‌కుండా ఉండ‌డానికి కోహ్లి లెగ్ సైడ్‌ డిఫెన్స్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు.

ఈ క్ర‌మంలో లెగ్ గల్లీ వద్ద ఫిలిప్స్ జంప్ చేస్తూ అద్బుత‌మైన క్యాచ్ అందుకున్నాడు. అయితే అది క్లీన్ క్యాచ్ కాదా? అని ఫీల్డ్ అంపైర్ థ‌ర్డ్ అంపైర్‌తో స‌ప్రందించాడు. థ‌ర్డ్ అంపైర్ ప‌లు కోణాల్లో ప‌రిశీలించి ఔట్‌గా ప్ర‌క‌టించాడు.

దీంతో చేసేదేమి లేక కోహ్లి నిరాశ‌తో మైదానాన్ని వీడాడు. అయితే ఆఫ్ సైడ్ ప‌డిన బంతి అంత షార్ప్‌గా ట‌ర్న్ అవుతుంద‌ని కోహ్లి అస్సలు ఊహించ‌లేదు. అంతేకాకుండా లెగ్‌ సైడ్‌లో గల్లీ ఫీల్డర్‌ను పెట్టి మరి విరాట్‌ను ట్రాప్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

ఎనిమిదేళ్ల త‌ర్వాత‌.. 
కాగా టెస్టుల్లో కోహ్లి ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు రావ‌డం ఎనిమిదేళ్ల త‌ర్వాత ఇదే మొద‌టి సారి. యువ ఆట‌గాడు శుభ్‌మన్ గిల్ గైర్హాజరీతో ఈసారి కోహ్లి వ‌న్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. కానీ కోహ్లికి వ‌న్ డౌన్ క‌లిసిరాలేదు. 

గ‌తంలో కోహ్లి వ‌న్ డౌన్‌లో త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు.  ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 3, 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటివరకు విరాట్ కేవ‌లం నాలుగు టెస్టుల్లోనే ఈ ప్లేస్‌లో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో 97 పరుగులు సాధించాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)