Breaking News

విరాట్‌ కోహ్లి షాకింగ్‌ నిర్ణయం..!?

Published on Thu, 02/22/2024 - 12:04

విరాట్‌ కోహ్లి.. గత కొన్ని రోజుల నుంచి క్రికెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. విరాట్‌కు ఏమైంది..? ఎక్కడ ఉన్నాడు? అన్న ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే కోహ్లి తాజా పోస్టుతో ఈ ప్రశ్నలకు తెరపడింది. కింగ్‌ కోహ్లి రెండో సారి తండ్రయ్యాడు.

అతడి భార్య అనుష్క శర్మ ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ ముద్దుల కొడుకుకు అకాయ్‌గా పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని విరుష్క జోడీ కాస్త ఆలస్యంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే  అభిమానులు ఓవైపు శుభాకాంక్షలు తెలుపుతూనే.. మరోవైపు కోహ్లి రీ ఎంట్రీపై చర్చ మొదలెట్టేశారు.

కోహ్లి రీ ఎంట్రీ డౌటే..
ఇక విరాట్‌ సతీమణి అనుష్క అనారోగ్య సమస్యలతో రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అనుష్క ప్రెగ్నెన్సీలో సమస్యలు ఉన్నాయని, అందుకే లండన్‌కు తీసుకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుష్కకు తోడుగా కోహ్లి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఇంగ్లండ్‌ సిరీస్‌ మొత్తానికి దూరమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

అయితే మరి కొంత కాలం పాటు విరాట్‌ ఫ్యామిలీ లండన్‌లో ఉండనున్నట్లు సమాచారం. దీంతో కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడు సైతం వారితో పాటు కొద్ది రోజులు లండన్‌లోనే నిర్ణయించుకున్నట్లు వినికిడి. ఈ క్రమంలో ఐపీఎల్‌-2024 సీజన్‌ ఫస్ట్‌హాఫ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

ఈ విషయంపై ఇప్పటివరకు అయితే ఆర్సీబీ ఫ్రాంఛైజీ నుంచి గానీ కోహ్లి నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు. కాగా ఐపీఎల్‌-17వ సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.  ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు విరాట్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: Virat Kohli- Akaay: కోహ్లి కొడుకుకి బ్రిటన్‌ పౌరసత్వం?!.. అందుకే లండన్‌లో..?

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)