చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Published on Sat, 05/03/2025 - 21:33

ఐపీఎల్‌-2025లో టీమిండియా స్టార్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో మ‌రో హాఫ్ సెంచ‌రీని కోహ్లి త‌న ఖాతాలో వేసుకున్నాడు. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 

క్రీజులో ఉన్నంత‌సేపు కింగ్ కోహ్లి బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. కేవ‌లం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 62 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో కోహ్లి ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..
👉ఐపీఎల్‌లో ఒక జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కోహ్లి రికార్డుల‌కెక్కాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు  సీఎస్‌కేపై 1146 ప‌రుగ‌లు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గ‌జం డేవిడ్ వార్న‌ర్ పేరిట ఉండేది. వార్న‌ర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 ప‌రుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో వార్న‌ర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.

👉అదేవిధంగా సీఎస్‌కేపై అత్య‌ధిక ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు సాధించిన ప్లేయ‌ర్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌కేపై 10 సార్లు ఏభైకి పైగా ప‌రుగులు సాధించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు శిఖ‌ర్ ధావ‌న్ పేరిట ఉండేది. ధావ‌న్ సీఎస్‌కేపై 9 సార్లు ఫిప్టీ ప్ల‌స్ ప‌రుగులు న‌మోదు చేశాడు.

👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఒకే జట్టు తరపున  300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్‌లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్‌(263) ఉన్నాడు.

👉టీ20 క్రికెట్‌లో ఒకే వేదిక‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్‌లు బాదాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్న‌స్వామి స్టేడియంలో 151 కొట్టాడు.

👉ఐపీఎల్‌లో 8500 ప‌రుగుల మైలు రాయిని అందుకున్న తొలి ప్లేయ‌ర్‌గా కోహ్లి రికార్డులెక్కాడు.
చ‌ద‌వండి: #Kagiso Rabada: కగిసో ర‌బాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్‌కు దూరం?

 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)