Breaking News

IPL 2025: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

Published on Fri, 03/28/2025 - 22:09

ఐపీఎల్‌-2025లో చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి ప‌ర్వాలేద‌న్పించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 30 బంతులు ఎదుర్కొన్న విరాట్‌.. 2 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 31 ప‌రుగులు చేశాడు. త‌ద్వారా కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కోహ్లి నిలిచాడు.

కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌కేపై 34 మ్యాచ్‌ల్లో 1068 ప‌రుగులు సాధించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ పేరిట ఉండేది. ధావ‌న్ చెన్నైపై 29 మ్యాచ్‌ల్లో 44.04 సగటుతో మొత్తం 1,057 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచ‌రీతో పాటు,  8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజా మ్యాచ్‌లో 3 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ధావ‌న్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి, ధావ‌న్ త‌ర్వాతి స్దానాల్లో వ‌రుస‌గా రోహిత్ శ‌ర్మ‌(896), డేవిడ్ వార్న‌ర్‌(696), కీరన్ పొలార్డ్(583) ఉన్నారు. 

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ర‌జిత్ పాటిదార్‌(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడ‌గా.. ఫిల్ సాల్ట్‌(32), విరాట్ కోహ్లి(31), ప‌డిక్క‌ల్‌(27) రాణించారు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో టిమ్ డేవిడ్‌( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ ఆహ్మ‌ద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ప‌తిరానా రెండు, ఖాలీల్ అహ్మ‌ద్‌, అశ్విన్ త‌లా వికెట్ సాధించారు.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి