#Virat Kohli: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

Published on Thu, 04/10/2025 - 20:55

టీమిండియా స్టార్ ప్లేయర్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 1,000 ఫోర్లు బౌండరీలు బాదిన తొలి ప్లేయర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లి ఈ రేర్ ఫీట్‌ను సాధించాడు.

కోహ్లి ఇప్పటివరకు ఐపీఎల్‌లో 249 మ్యాచ్‌లు ఆడి 1001 బౌండరీలు బాదాడు. అందులో 721 ఫోర్లు, 280 సిక్స‌ర్లు ఉన్నాయి. కోహ్లి తర్వాతి స్ధానంలో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌(920) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి ఫర్వాలేదన్పించాడు. 14 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 పరుగులు చేశాడు.

అదే విధంగా ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు కోహ్లి కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు 249 ఇన్నింగ్స్‌ల్లో 280 సిక్సర్ల బాదాడు. మరో మూడు సిక్సర్లు కొడితే భారత కెప్టెన్ రోహిత్ శర్మను కోహ్లి అధిగమిస్తాడు. రోహిత్‌ ఐపీఎల్‌లో 256 ఇన్నింగ్స్‌ల్లో 282 సిక్సర్లు బాదాడు.

ఐపీఎల్‌లో అత్యధిక బౌండరీలు బాదిన టాప్‌-5 ఆటగాళ్లు..
1001* – విరాట్ కోహ్లీ
920 – శిఖర్ ధావన్
899 – డేవిడ్ వార్నర్
885 – రోహిత్ శర్మ
761 – క్రిస్ గేల్

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-5 ఆటగాళ్లు..
క్రిస్‌ గేల్‌- 357
రోహిత్‌ శర్మ- 282
విరాట్‌ కోహ్లి- 278
ఎంఎస్‌ ధోని- 259
ఏబీ డివిలియర్స్‌- 251
చ‌ద‌వండి: సంచ‌ల‌నం.. 64 ఏళ్ల వ‌య‌స్సులో అంత‌ర్జాతీయ అరంగేట్రం
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)