ముంబైలో ఫ్లాట్‌ కొన్న విరుష్క జోడీ.. ఎన్ని కోట్లంటే?

Published on Mon, 07/27/2026 - 17:21

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శ‌ర్మ దంప‌తులు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఈ జంట ముంబైలోని వర్సోవా ప్రాంతంలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ జాప్‌కీ.కామ్ ప్రకారం.. ఈ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు  విరుష్క జోడీ రూ. 18.29 కోట్లు చెల్లించిన‌ట్లు తెలుస్తోంది. 

ఈ ఫ్లాట్ సుమారు 2,644  చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్లాట్‌తో పాటు మూడు కార్ పార్కింగ్ స్లాట్‌లు కేటాయించబడ్డాయి. దీనికి సంబంధించి జూలై 21న‌ రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. దీని కోసం కోహ్లీ దంపతులు రూ.1.09 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. 

కాగా ముంబైలోని వ‌ర్లీలో ఇప్ప‌టికే వీరికి లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లి ఫ్యామిలీ ఎక్కువ‌గా లండ‌న్‌లో ఉంటుంది. అక్క‌డ కూడా విలాసవంతమైన ఇంటిని కోహ్లి కొనుగోలు చేశాడు.

చివరగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత తరపున బరిలోకి దిగిన కింగ్‌ కోహ్లి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. సెప్టెంబర్‌ 27న వెస్టిండీస్‌తో జరగనున్న వన్డేలో కోహ్లి తిరిగి భారత జెర్సీలో కనిపించనున్నాడు.

#

Tags : 1

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)